తిరస్కరించిన వాళ్లే మెచ్చుకునేలా చేసిన ఎన్టీఆర్.. నిజమైన దేవుడు అంటూ?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Shocking Secrets About Senior Ntr Details Here Goes Viral ,  Lord Krishna Role ,-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు నందమూరి వెంకట్రావమ్మ కాగా తండ్రి పేరు నందమూరి లక్ష్మయ్య చౌదరి.ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం కాగా ఆ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు.

దర్శకుడు యాక్షన్ అని చెప్పగానే పాత్రలో లీనమైన ఎన్టీఆర్ జూనియర్ ఆర్టిస్టులను కర్రతో చితకబాదగా దర్శకుడు ఎన్టీఆర్ కు అలా కొట్టకూడదని కొట్టినట్టు నటిస్తే చాలని సూచించారు.ఎన్టీఆర్ దర్శకునితో పోలీసులు అలానే బాదుతారు సార్ అని జవాబివ్వడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ ను కమర్షియల్ స్టార్ ను చేసిన సినిమా ఏదనే ప్రశ్నకు పాతాళ భైరవి అని సమాధానంగా వినిపిస్తుంది.

స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా సీనియర్ ఎన్టీఆర్ అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.

కొన్ని సినిమాలలో కురూపి, అవిటివాడి పాత్రలలో ఎన్టీఆర్ నటించి ఎలాంటి పాత్రలోనైనా నటించగలనని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కృష్ణుడి పాత్ర అంటే ప్రేక్షకులకు మొదట సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.

సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పెళ్లాలు అనే సినిమాలో తొలిసారి కృష్ణుడి వేషం వేస్తే ఆ సమయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

Telugu Mothernandamuri, Senior Ntr, Secrets, Tollywood-Movie

సొంత ఊరు అనే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించగా ఆ సమయంలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.మాయాబజార్ షూటింగ్ సమయంలో మాత్రం కృష్ణుడి వేషంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ను చూసి దేవుడే దిగివచ్చినట్టు ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.తనను తాను మలుచుకున్న ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో తనను తిరస్కరించిన వాళ్లే మెచ్చుకునేలా చేశారు.

ఎంతోమంది పేద ప్రజల హృదయాలలో సీనియర్ ఎన్టీఆర్ నిజమైన దేవుడిగా నిలిచిపోయారనే చెప్పాలి.సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఆరోజుల్లోనే కోటి రూపాయల కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube