అచ్చం అమితాబ్ బచ్చన్ లాగానే కనిపించిన ఆ వ్యక్తి.. వీడియో వైరల్...

లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటుంటారు.అయితే అది నిజమేనని కొందరిని చూస్తే ఒప్పుకోవాల్సిందే.

 The Man Who Looked Like Amitabh Bachchan Video Went Viral , Amithab Bachan ,-TeluguStop.com

సామాన్య ప్రజలను పోలిన వారు ఎందరున్నారో తెలియదు కానీ సెలబ్రెటీలను పోలిన వారు ఎప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంటారు.అలియా భట్, ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, విరాట్ కోహ్లీ, ఇలా ఎందరో సెలబ్రిటీలను పోలిన వ్యక్తులు ఇప్పటికే కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఈ జాబితాలోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా చేరిపోయారు.తాజాగా అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి అచ్చుగుద్దినట్టు అమితాబ్ బచ్చన్ లాగానే ఉన్నాడు.కానీ అతను పేరు శశికాంత్ పెడ్వాల్.

ఈయన పూణేకి చెందిన శశికాంత్ పెడ్వాల్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.

పెడ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్ వీడియోలతో నిండిపోయింది.ఎందుకంటే అక్కడ అతను సీనియర్ బచ్చన్ లాగా డ్యాన్స్‌లు చేస్తున్నాడు.ఇంకా అమితాబ్ బచ్చన్ ఇలాంటి యాక్షన్ లెన్నో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియో లో శశికాంత్ అమితాబ్ బచ్చన్ లాంటి అవతారం లో ఉండటం చూడొచ్చు.అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు.ఈ వీడియో చూసి నెటిజన్లందరూ ఆశ్చర్యపోతున్నారు.ఒక క్షణం పాటు ఇతను అమితాబ్ బచ్చనా లేక వేరే వ్యక్తి అనేది గుర్తించలేకపోయానని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఈ వీడియోకి లక్షలకొద్దీ వ్యూస్, వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube