కోనసీమ జిల్లా ను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చడం పై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అగ్గి రాజుకుంది.వివిధ పార్టీలు తమ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా తమ స్పందనను తెలియజేస్తున్నాయి.
అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసగృహాల తో పాటు, బస్సుల దహనం ఘటన చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు కారణం అయింది.ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును ఒప్పుకునేది లేదని కోనసీమ జిల్లా గానే కొనసాగించాలంటూ కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై టిడిపి, వైసిపి లు స్పందించాయి.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై పెదవి విప్పారు.
కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేద్కర్ పేరు కూడా పెడితే బాగుండేది అని .అలా చేసి ఉంటే ఇప్పుడు అమలాపురం అగ్నిగుండం మారేది కాదు అంటూ పవన్ అన్నారు.అసలు అంబేద్కర్ పేరు పెట్టడంలో ఎందుకు ఇంత ఆలస్యం చేసారో అర్థం కావడం లేదని పవన్ అనుమానం వ్యక్తం చేశారు.మిగతా జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉన్నా.
ఇప్పుడు అంబేద్కర్ జిల్లా ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను స్వీకరించేందుకు సమయం ఇచ్చారని , ఇదంతా గొడవలు జరగాలనే ఉద్దేశంతోనే చేశారంటూ పవన్ విమర్శించారు.అంబేద్కర్ కు గౌరవం ఇవ్వడం అంటే ఆయన సిద్ధాంతాలను పాటించడమేనని పవన్ పేర్కొన్నారు.
అంతేకాదు ఎస్సీల లో వైసిపి బలం తగ్గిందని.వారు పార్టీకి దూరమవుతున్నారు అని భావించే ఇప్పుడు వైసీపీ నేతలు ముందస్తుగా ప్లాన్ చేసి గొడవలను సృష్టించారని పవన్ విమర్శించారు.
అమలాపురం లో చోటుచేసుకున్న ఘటన లో తమ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారని హోం మంత్రి తానేటి వనిత చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పవన్ చెప్పుకొచ్చారు.అసలు జిల్లాల పేర్లు పెట్టే సమయంలో స్థానికుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాముల ను ఒక జిల్లాకు పరిమితం చేశారని కృష్ణానది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పేరు పెట్,టి కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని పవన్ విమర్శించారు.

మిగతా జిల్లాల తో పాటే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అని పేరు పెడితే సహజంగా ఉండేదని, అభ్యంతరాలు ఉంటే 30 రోజుల సమయం ఇచ్చి కలెక్టరేట్ కు రమ్మని చెప్పారు . 30 రోజులు గడువు ఎందుకు గొడవలు జరగాలని కాదా ? మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు అంటే ఏమనుకోవాలి ? దాడి జరుగుతుంటే ఇంటికి రక్షణ గా ఉండాలి కదా ? చేసిందంతా చేసి జనసేన పై ఆరోపణలు చేస్తూ కుల సమీకరణపై రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.







