మేము టికెట్స్ పెంచడం లేదు బాబోయ్ అంటున్న చిన్న సినిమాలు

టాలీవుడ్ లో గత కొంత కాలంగా సినిమా టికెట్ ధరల గురించి చర్చ జరుగుతోంది.ఇదంతా కూడా కరోనా వలన జరిగిన నష్టం వల్లనే అని తెలిసిందే.

 Movies Which Are Not Increasing Ticket Rates, F3 Movie , Shekar Movie, Sree Vis-TeluguStop.com

దానికి తోడు సినిమాలను చూసే ప్రేక్షకులు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు.పెరిగిన టికెట్ ధరలతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

అటు చిన్న సినిమాలు కూడా ధరలు పెంచేయడంతో ప్రేక్షకులకు కష్టంగానే ఉంది.తద్వారా థియేటర్స్ కి ప్రేక్షకులను తీసుకురావడం చాలా ఇబ్బందిగా మారింది.సో… చాలా చిన్న బడ్జెట్ సినిమాలు నష్టాల బాట పడుతున్నాయి.వీటన్నిటినీ చూస్తున్న కొన్ని పెద్ద సినిమాల వారు చాలా తెలివిగా సాధారణ టికెట్ ధరలకే మా సినిమాను చూడొచ్చు అంటూ ఎఫ్ 3 చిత్ర నిర్మాత దిల్ రాజ్ ఇప్పటికే ప్రకటించాడు.

అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఎఫ్ 3 ను చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పారు.దీనితో ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది.

ఎఫ్ 2 హిట్ కావడంతో ఎఫ్ 3 ను తీశారు.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మరియు సునీల్ లు నటించారు.

ఈ సినిమా మే 27 వ తేదీన రిలీజ్ కానుంది.ఈ సినిమాపై అంచనాలు ఇలా బాగా పెంచేశారు.

ఇందుకు ఒక వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తోంది.ఇక దీనితో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది అని చెప్పాలి.

ఇక మూడు రోజుల క్రితం విడుదల అయిన రాజశేఖర్ మూవీ శేఖర్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ లో జీవిత కూడా సాధారణ టికెట్ ధరకే మా సినిమాను చూడండి అని చెప్పారు.అందరిలాగా మా సినిమా టికెట్ ధరను పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు.

కాబట్టి చిన్న పెద్ద అందరూ థియేటర్ కు వెళ్లి సినిమాను హిట్ చేయండి అన్నారు.కానీ వాస్తవానికి సామాన్యులు కూడా థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే ధరలు తగ్గించాలి.

అప్పుడే జనాలు ఫుల్ గా వచ్చి కలెక్షన్ కు బాగా వస్తాయి.అయితే కొన్ని సినిమాలు మాత్రం బడ్జెట్ ఎక్కువ అయిందని, ఆ భారాన్ని ప్రేక్షకులపై రుద్దడం చేస్తున్నారు.

దీనితో ప్రేక్షకులు థియేటర్ లకు రావడానికి ఆలోచిస్తున్నారు.ఈ తరహా రేట్ లతో జనాలు రావడం లేదు.

అందుకే విశ్వక్ మూవీ టాక్ బాగున్నా కలెక్షన్స్ రాలేదు.

Telugu Acharya, Akhanda, Dil Raju, Jeevitharaja, Radhya Shyam, Rajashekar, Sheka

ఇక యంగ్ హీరో శ్రివిష్ణు నటించిన మరో చిత్రం భళా తందనాన మూవీ పై కూడా టికెట్ ధర ప్రభావం బాగా పడిందని తెలుస్తోంది.ఈ హీరో కొత్త కథల్ని ఎంచుకుంటాడు అని పేరుంది.అందుకే ప్రేక్షకులు ఇతని సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లాలని అనుకున్నారు.

కానీ టికెట్ ధరల కారణంగా సగానికి సగం మంది వెళ్ళక ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఒక సినిమా చూడాలంటే… ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీ థియేటర్ కి వెళ్ళాలంటే… మనిషికి 1000 చొప్పున 5000 ఖచ్చితంగా కావాలి.

అందుకే ప్రేక్షకులు సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నారు.బడ్జెట్ పేరు చెప్పి అన్ని సినిమాలు తమ టికెట్ ధరలు కొన్ని రోజులైనా పెంచాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ లు పెట్టుకుని మరీ అధికారికంగా అనుమతులు తీసుకుంటున్నారు.

అయితే టికెట్ రేట్ ఎంత ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం వెళ్ళక తప్పదు.కానీ అందరూ సినిమాకు వెళితేనే ఆ సినిమా హిట్ అవుతుంది.దీనితో కథ బాగున్నా చాలా సినిమాలు సరైన కలెక్షన్ లు రాక నిరాశ పరుస్తున్నాయి.

Telugu Acharya, Akhanda, Dil Raju, Jeevitharaja, Radhya Shyam, Rajashekar, Sheka

ఇక ఈ మూడు నెలల్లో పుష్ప, భీమ్ల నాయక్ మరియు అఖండ సినిమాలు టికెట్ ధరలతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాయి.సినిమాలో కథ, కథనం బాగుంటే టికెట్ ఎంత ధర ఉన్నా ప్రేక్షకులు వస్తారు అని చెప్పడానికి ఇవి మంచి ఉదాహరణలు అని చెప్పాలి.అయితే కలెక్షన్ లు రావాలి కాబట్టి ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ టికెట్ ధరలు పెంచి వీకెండ్ లో కోట్లను రాబట్టుకుంటున్నారు.

ఇక ఒక సినిమా రిలీజ్ అయిన మొదటి రోజున మంచి కలెక్షన్స్ సాధించినా ఎక్కువ రోజులు థియేటర్ లో కొనసాగడం లేదు.దీనికి కారణం ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవడమే అంటున్నారు.

దీనితో చిన్న సినిమాలు హిట్ అయిన కలెక్షన్స్ లు సాధించలేక పోతున్నాయి.మంచి గట్స్ ఉమ్మాస్ కథలే హిట్స్ సాధిస్తున్నాయి.

అందులో ఇటీవలే విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఎఫ్ 2 చిత్రాలు ఉన్నాయి.

అయితే ఇలా ఒక్కసారిగా సినిమా పరిశ్రమ సీన్ మారడానికి కారణం కరోనా వైరస్ అని తెలిసిందే.

ఆ రెండు సంవత్సరాలు థియేటర్ లు మూసివేయడంతో ఎంటర్ టైన్మంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఓ టీ టి లు మేమున్నాం అంటూ వచ్చేశాయి.అలా ఈ రెండు సంవత్సరాలు అందరూ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లలో వెబ్ సీరిస్, సినిమాలు, షో లు చూస్తూ బాగా అలవాటు పడిపోయారు.

అందుకే చాలా మంచి థియేటర్ కు వెళ్ళడం మానేశారు.హిట్ అయితే 50 రోజులు లేదా 30 రోజులలో ఓ టి టి లోకి వచ్చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఈ నమ్మకాన్ని రాధే శ్యామ్ మరియు ఆచార్య లాంటి సినిమాలు నిజం చేశాయి.ఇక పాన్ ఇండియా అన్న మాట వచ్చాక… స్థానిక సినిమాలు అంతే చిన్న చూపు వచ్చింది.

అందుకే జనాలు పాన్ ఇండియా సినిమాలు అయితేనే ఎగబడి చూస్తున్నారు.లేదంటే లైట్ తీసుకుంటున్నారు.అందుకే ఎఫ్ 3 లాంటి పెద్ద స్టార్ హీరో నటించిన సినిమాకు టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే సినిమాను అందుబాటులోకి తెస్తున్నారు.సినిమా మీద నమ్మకం తోనే దిల్ రాజు టికెట్ ధర పెంచడం లేదు.

మరి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ కు రప్పిస్తుందా ? వచ్చినా తక్కువ టికెట్ ధరలతో కలెక్షన్ లు భారీగా సాధిస్తుందా ? అన్న పలు విషయాలపై క్లారిటీ రావాలంటే ఇంకో వారం రోజులు ఆగక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube