ఆ అమ్మవారి ఆలయంలో బంగారం ప్రసాదంగా ఇస్తారు.. ఓసారి వెళ్లి చూద్దామా?

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు ఇక్కడ చూసింది, చదివింది నిజమే.బేసిగ్గా ఆలయాలలో ప్రసాదంగా శనగలు, చక్కెర, పులిహోర, దద్దోజనం, మరమరాలు మొదలగు ఆహార పదార్ధాలను ప్రసాదంగా ఇస్తూ వుంటారు.

 Gold Is Offered In The Temple Of The Goddess  Let's Go To Osari And See  , Gold,-TeluguStop.com

ప్రపంచంలో ఏ దేశంలోనైనా తినే పదార్థాలనే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు.అయితే తాజాగా ఓ ఆలయంలో మాత్రం దైవ దర్శనం కోసం వెళ్ళిన భక్తులకు బంగారు నాణెం లేదా వెండి, డబ్బులను ప్రసాదంగా ఇస్తున్నారు.అవును… ఇంకా ఈ ఆలయం కూడా మన దేశంలోనే వుంది.ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో బంగారం, నగదును ప్రసాదంగా ఇవ్వడం ఇపుడు సంచలంగా మారింది.

వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ లో ఉన్న ‘రత్లామ్ మహాలక్ష్మి‘ ఆలయం గురించి మనదగ్గర చాలా కొద్దిమందికి తెలుసు.అక్కడి వింతలు, విడ్డురాలు గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

సంవత్సరం పొడువునా ఆ గుడి భక్తులతో రద్దీగా ఉంటుంది.అమ్మవారికి భక్తులు కానుకగా నగలు, కోట్లది రూపాయల నగదు, వెండి, బంగారం, రాగి, ఇత్తడి, రాళ్లు, పచ్చలు, కెంపులు, డిమాండ్స్ మొదలగు ఆభరణాలు సమర్పించుకుంటారు.

అక్కడ వున్న ఒకే ఒక్క సెంటిమెంట్ వలన భక్తులు అలా అమ్మరికి సమర్పించుకుంటారని వినికిడి.అదేమంటే, అమ్మవారికి యెంత ఇస్తే అమ్మవారు మళ్ళీ ఆ సొమ్మును తిరిగి డబుల్ చేస్తుందని అక్కడి స్థానికుల నమ్మకం.

ఈ రకంగా ఆ ఆలయాన్ని కుబేరుని నిధిగా పిలుస్తారు.దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో 5 రోజులపాటు దీపోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఆ సమయంలో పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బులతోనే మహాలక్ష్మి అమ్మవారిని అలంకరిస్తారు.ఈ క్రమంలో ఆ గుడిని దర్శించుకున్న భక్తులను అక్కడి పూజారులు వట్టి చేతులతో పంపరు.

భక్తులకు పసాదం రూపంలో బంగారం, వెండి లేదా డబ్బులు ఇలా ఏదో ఒకటి ప్రసాదంగా ఇచ్చి పంపిస్తారట.ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ అమ్మవారికి కానుకలు ఇచ్చే వారి సంఖ్య చాలా పెద్దమొత్తంలో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube