స్టేజ్ పై డ్యాన్స్ ఎందుకు చేసాడో చెప్పేసిన సూపర్ స్టార్.. అలా జరిగిపోయిందంటూ..

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు.అలాగే ఈయన అంత అందగాడు కూడా ఎవ్వరు లేరు.46 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా కనిపిస్తున్న మహేష్ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతారు.ఈయనకు అమ్మాయిల ఫాలోయింగ్ నే ఎక్కువ.

 Mahesh Babu About His Mass Dance On Stage, Mahesh Babu, Sarkaru Vaari Paata, Kee-TeluguStop.com

మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.

ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.

అందుకే మహేష్ బాబు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతాయి.

మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా మెప్పించగల సత్తా ఉన్న హీరో మహేష్ బాబునే.ఇక ఇటీవలే మహేష్ బాబు నటించిన సర్కారు వారి రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది.

కలెక్షన్స్ లో కూడా అదరగొడుతూ ముందుకు వెళుతున్నాడు సూపర్ స్టార్.ఈ సినిమాలో మహేష్ బాబు మరింత అందంగా కనిపించి అమ్మాయిల మనసు దోచేశాడు.

Telugu Parasuram, Keerthy Suresh, Mahesh Babu, Maheshbabu, Sarkaruvaari-Movie

ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సర్కారు వారి పాట కర్నూల్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసారు.ఈ ఈవెంట్ లో ఎప్పుడు కూడా స్టేజ్ మీద డ్యాన్స్ వేయని సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం డ్యాన్స్ వేసాడు.ఫర్ ది ఫస్ట్ టైం స్టేజ్ మీద మ మ మహేశా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.దీంతో అందరు ఆశ్చర్య పోయారు.అయితే తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న మహేష్ ను ఈ డ్యాన్స్ పెర్ఫెర్మెన్స్ గురించి అడుగగా ఈయన ఆసక్తికర విషయాలు తెలిపాడు.మహేష్ బాబు దీని గురించి మాట్లాడుతూ.

స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసారు కదా అసలు ఎందుకు అలా వేశారు అని అడుగగా.అది ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు.

అసలు ఏం జరుగుతుందో అని మా టీమ్ మొత్తం షాక్ అయ్యారు.రెండేళ్లు కస్టపడి ఈ సినిమాను చేసాం.

దానికి అభిమానుల నుండి వస్తున్న రెస్పాన్స్ చుసిన తర్వాత నాకు స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ చేయాలనీ అనిపించింది.అని చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube