వెన్నునొప్పిని క్షణాల్లో తగ్గించే ఈ నూతన యంత్రం ఎలా పని చేస్తుందంటే..

మనలో చాలా మంది వెన్నునొప్పితో ఇబ్బంది పడుతుంటారు.కూర్చోవడం, పని చేయడం, నిలబడడం, నడవడం వంటి వాటి వల్ల స్లిప్ డిస్క్ సమస్య వస్తుంది.

 Exclusive Small Machine May Prove Handy In Relievingback , Exclusive Small Machi-TeluguStop.com

కొన్ని మందులతో, వ్యాయామంతో చికిత్స ప్రారంభమవుతుంది.అయితే కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపశమనం కలుగదు.

ఫిజియోథెరపీ చేయించుకున్నా ఎక్కువ మోతాదులో మందులు వాడినా వెన్ను నొప్పి తగ్గదు.ఇవన్నీ వెనుక కండరాలను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు.

ఇటువంటి పరిస్థితిలో వెన్నునొప్పిని ఎలా వదిలించుకోవాలి? ఇందుకోసం యాంత్రిక మార్గం ఏమైనా ఉందా? Deutsche Welle నివేదిక ప్రకారం, 6 సంవత్సరాల క్రితం జర్మన్ మహిళ Gudrun Garmer Kingsకి స్లిప్ డిస్క్ సమస్య వచ్చింది.చికిత్స చేయించుకున్నా నొప్పి తగ్గలేదు.

వీపులోని చిన్న కండరాలు వాచిపోయి పనిచేయడం మానేశాయని వైద్యులు తెలిపారు.ఈ సమయంలో వైద్యులు ఒక కొత్త టెక్నిక్ గురించి తెలుసుకున్నారు.

దీనిలోభాగంగా శరీరం లోపల ఒక యంత్రాన్ని అమర్చారు.

ఇది కండరాలను రిపేర్ చేస్తుంది.

ఇందులో మందు వేసుకోవాల్సిన అవసరం లేదు.ఈ యంత్రం పేరు న్యూరో మస్కులర్ సిమ్యులేటర్.

ఇది శరీరంలో అమర్చబడే యంత్రం.ఇది బాధితులకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

నివేదిక ప్రకారం ఈ చిన్న పరికరం పల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.వ్యాయామంలో సహాయపడుతుంది, తద్వారా చిన్న కండరాలు లోతుగా యాక్టివ్ అవుతాయి.

రోగికి ఎంతో ఉపశమనం కలుగుతుంది.ఈ యంత్రం ఎలా పని చేస్తుందనేది ఇప్పుడు తలెత్తే ప్రశ్న.

ఈ యంత్రాన్ని శరీరంలోకి చొప్పించేందుకు దిగువ వీపుపై కోత వేసి చికిత్స చేస్తారు.ఈ పల్స్ జనరేటర్ పరికరం దిగువ శరీరంలోని కండరాలను నియంత్రిస్తుంది.

అప్పుడు రిమోట్ కంట్రోల్ సహాయంతో పనిచేయడం ప్రారంభిస్తుంది.ఈ పరికరం నాడులకు విద్యుత్ ప్రకంపనలను పంపుతుంది.

దీని వల్ల కండరాలలో కదలిక వస్తుంది.ఫలితంగా నరాలు, కండరాలు తిరిగి చురుగ్గా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube