సూపర్ టాలెంట్.. నాలుకతో బొమ్మలు గీస్తున్న యువకుడు

మనమైతే నాలుకతో రుచి చూస్తాం.కానీ ఒక జీవి నాలుకతో వేటాడుతుంది.

 Super Talent A Young Man Drawing Toys With His Tongue , Super Talent, Viral Ne-TeluguStop.com

ఇంకోజీవి దాన్ని వడపోతకు వాడుతుంది… మరొకటి నాలుకను స్ట్రా లా వాడేసుకుంటుంది.కానీ ఓ వ్యక్తి మాత్రం నాలుకను బొమ్మలు గీయడానికి ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా చిత్రకారులంటే కాన్వాస్, పెయింట్స్, బ్రష్ లు ఉంటే సరిపోతుంది.తమ ఊహలకు రంగులద్ది సరికొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తారు.

కానీ ఓ యువకుడు మాత్రం చాలా డిఫరెంట్.చేత్తో పెయిటంగ్ వేస్తే ఏం గొప్ప అనుకున్నాడో ఏమో.ఏకంగా నాలుగతో బొమ్మలు గీస్తూ వారెవా అనిపించుకుంటున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా బలిఘట్టం గ్రామానికి చెందిన సుర్ల వినోద్‌(18) తన అద్భుత ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.

నాలుకతో గోడలమీద, పేపర్‌ల మీద బొమ్మలు గీస్తూ అబ్బురపరుస్తున్నాడు.చిన్ననాటి నుంచి డ్రాయింగ్‌ మీద ఉన్న ఆసక్తితో…క్లాస్‌రూమ్‌లో బుక్స్‌పై, ఇంటికొచ్చాక గోడల మీద ఏదో ఒక బొమ్మలు గీస్తూ ఉండేవాడు.

తాను అందరిలో భిన్నంగా ఉండాలని మొదటి నుంచి తాపత్రయపడుతూ ఉండేవాడు.అందుకే అతనికి ఇష్టమైన పెయింటింగ్‌పై దృష్టి పెట్టాడు.

అయితే, ఒకరోజు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటే ఓ ఆర్టిస్ట్‌ నాలుకతో బొమ్మలు గీయడం కనిపించింది.అందరిలా చేత్తో బొమ్మలు ఎవరైనా గీస్తారు.

కాయి ఇలా కొత్తగా నాలుకతో చేస్తే తనకంటూ ఓ గుర్తింపు వస్తుందని భావించాడు.మెల్లగా నాలుకతో బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు.

లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ సమయంలో దీనిపై దృష్టి పెట్టి మరింత సాధన చేశాడు.అది చూసిన గ్రామంలో యువకులు, పెద్దలు వినోద్‌ని అభినందించారు.

వినోద్‌ ఆసక్తిని తన తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని వాళ్లు కూడా ప్రోత్సహించారు.భవిష్యత్తులో వినూత్నమైన మరిన్ని బొమ్మలు గీచి, ప్రపంచానికి చూపాలని ఇప్పుడు నిరంతర సాధన చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube