పిల్లల మానసిక ఎదుగుదలను పెంపొందించే అద్భుత ఆహారాలు ఇవే!

పిల్ల‌ల శారీర‌క ఎదుగుద‌లే కాదు మాన‌సిక ఎదుగుద‌ల కూడా ఎంతో ముఖ్యం.పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో చాలా మంది పిల్ల‌లు శారీర‌కంగా పెరుగుతున్నారు.

 These Are Wonderful Foods That Enhance A Child's Mental Development! Child's Men-TeluguStop.com

కానీ, మాన‌సికంగా ఎద‌గ‌లేక‌పోతున్నారు.ఇందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.

అయితే పిల్లల మానసిక ఎదుగుదలను పెంపొందించే బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌దే.పిల్ల‌ల‌తో త‌ల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ‌ స‌మయాన్ని గ‌డ‌పాలి.

వారి చేత ద‌గ్గ‌రుండి ఆట‌లు ఆడించాలి.వారికి ప్ర‌తి విష‌యాన్ని నేర్పించాలి.

పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని స‌రైన దారిలో న‌డిపించాలి.వారి పొర‌పాట్ల‌ను స‌హ‌నంతో స‌రిదిద్దాలి.

వారిలో మానసిక ధైర్యాన్ని నింపాలి.అలాగే వారి డైట్‌లో పోష‌కాహారాలు ఉండేలా చూసుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను పిల్ల‌ల‌కు ఇస్తే.వారి మెద‌డు అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పిల్లల మానసిక ఎదుగుదలను పెంపొందించే ఆ అద్భుత ఆహారాలు ఏంటో చూసేయండి.

పాలు.

ఇది సంపూర్ణ పోష‌కాహారం.పిల్ల‌ల చేత ఖ‌చ్చితంగా రోజుకు ఒక గ్లాస్ పాల‌ను తాగిస్తే.

వారి ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా పెరుగుతాయి.అదే స‌మ‌యంలో మాన‌సిక ఎదుగుద‌ల చ‌క్క‌గా పెరుగుతుంది.

పాల‌తో పాటు పెరుగు, జున్ను, నెయ్యి వంటివి కూడా పిల్ల‌ల‌కు పెడుతుండాలి.అలాగే పిల్ల‌ల డైట్‌లో ఆకుప‌చ్చ కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

రోజుకు రెండు ర‌కాల పండ్ల‌ను వారి చేత తినిపించాలి.క్యారెట్‌, బీట్‌రూట్‌, బం
గాళ‌దుంప
మ‌రియు చిల‌క‌డ‌దుంపుల‌ను పిల్ల‌ల ఆహారంలో భాగం చేయాలి.

త‌ద్వారా వారు శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగానూ ఎదుగుతారు.

Telugu Childs, Foods, Tips, Latest-Telugu Health Tips

పిల్లల మానసిక ఎదుగుదలను పెంపొందించే ఆహారాల్లో గుడ్డు ఒక‌టి.రెగ్యుల‌ర్‌గా ఉడికించిన గుడ్డును పిల్ల‌ల చేత తినిపించాలి.ఇక జీడిప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, బాదం, ఎండు ద్రాక్ష‌, అత్తి పండ్లు, ఖ‌ర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ను పిల్ల‌ల డైట్‌లో చేర్చాలి.

ఓట్స్‌, ఉడికించిన శ‌న‌గ‌లు, గుమ్మ‌డి గింజ‌లు వంటి ఆహారాలు సైతం పిల్ల‌ల మెద‌డును అభివృద్ధి చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube