జగన్ నిర్ణయం పై తెలంగాణ నేతల్లో అనుమానాలు ?

ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో వైసీపీకి నాలుగు స్థానాలు దక్కడంతో.అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ లెక్కలు వేసి మరీ అభ్యర్థులను ఎంపిక చేశారు.

 Doubts Among Telangana Leaders Over Jagan's Decision Telangana, Telangana Cm Kcr-TeluguStop.com

దీంట్లో తెలంగాణకు చెందిన ఇద్దరికి అవకాశం దక్కింది.దీంతో జగన్ పై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.

ఏపీలో ఎంతో మంది వైసీపీ నాయకులు ఉండగా, తెలంగాణకు చెందిన ఇద్దరికి రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడంఏంటి అనే చర్చ జరుగుతోంది.ఏపీ లోనే కాదు దీనిపై తెలంగాణలోని రాజకీయ వర్గాల్ నూ చర్చనీయాంశం అవుతోంది.

ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని వికారాబాద్ జిల్లా కు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు కేటాయించగా, మరో స్థానాన్ని జగన్ తన వ్యక్తిగత న్యాయవాది అయిన తెలంగాణలోని నిర్మల్ కు చెందిన నిరంజన్ రెడ్డి కి ఇచ్చారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఆర్.కృష్ణయ్య కు ఏపీ, తెలంగాణ లోనూ పట్టు ఉంది.గతంలో అనేక సార్లు బీసీ సమస్యలపై అనేక ఉద్యమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన అనుభవం ఉండడంతో, ఆర్ కృష్ణయ్య ఎంపికపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు.కానీ జగన్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కి ఇవ్వడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అసలు తెలంగాణకు చెందిన వారికి జగన్ రాజ్యసభ స్థానాలు ఇవ్వాలి అనుకోవడం ఎవరికీ అంతుపట్టడం లేదు.దీనిపై ప్రస్తుతం తెలంగాణ నేతల్లో అనుమానాలు పెరగడానికి కారణం అవుతున్నాయి.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థులను పోటీకి దింపుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Jagan, Layerniranjan, Krishnayya, Rajyasabha, Telangana, Trs

తెలంగాణ సీఎం కేసీఆర్ కు జగన్ కు మధ్య స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉండడంతో.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం లేకుండా చేసేందుకు కేసీఆర్ సూచన తోనే జగన్ ఈ విధంగా చేస్తున్నట్టు తెలంగాణ నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి.ప్రస్తుతం షర్మిల పార్టీ పెట్టింది కూడా టిఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకే అని, ఇప్పుడు జగన్ కూడా టిఆర్ఎస్ కు మేలు చేసేందుకే వ్యూహాత్మకంగా తెలంగాణకు చెందిన ఇద్దరికి రాజ్యసభ స్థానాలు ఇచ్చినట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube