విశాఖపట్నం లోని విద్యార్థులు వేసవి విజ్ఞాన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.బుధవారం ఆమె జిల్లా ప్రజా పరిషత్ మందిరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కొండ రమాదేవి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా సరస్వతి విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్ఞ చేసిన అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవిలో క్రీడలతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అందుకు జిల్లా గ్రంథాలయం వారు ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ వేసవి విజ్ఞాన శిబిరం ద్వారా విద్యార్థులలోని ప్రతిభను పైకి తీసుకురాగల మని తెలిపారు.
ఈ శిబిరము మే 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించబడుతుందని, పెద్దలు చెప్పే కథలు ద్వారా కథలు వినుట, పుస్తకపఠనం, పుస్తక సమీక్ష, పెద్దల ద్వారా కథల వినుట, చెప్పుట, చిత్రలేఖనం పేపర్ ఆర్ట్స్ మొదలైన సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజు ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు నిర్వహించబడుతున్నాయిని తెలిపారు.కావున ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులు ప్రోత్సహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కార్పొరేటర్ ఉరికుటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.







