బాలయ్య ఇంటి వైపు దూసుకెళ్ళిన కారు.. తృటిలో తప్పిన ప్రమాదం?

టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Road-accident Balakrishna Home Jubilee Hills Nandamuri Balakrishna, Road Acciden-TeluguStop.com

ఇటీవలే అఖండ సినిమాతో మంచి విజయం అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు.ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య ఇంటి సమీపంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది.

వేగంగా వస్తున్న ఒక కారు వెళ్లి బాలయ్య ఇంటి గేటు నుండి కొట్టింది.అసలేం జరిగిందంటే.

బాలకృష్ణ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వద్ద నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.ఆయన నివాసం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అనంతరం బాలయ్య ఇంటి వైపునకు వెళ్ళి బాలయ్య ఇంటి గేటును కూడా ఢీకొట్టింది.

ఈ ఘటన తాజాగా మంగళవారం రోజున సాయంత్రం చోటు చేసుకుంది.

Telugu Hyderabad, Jubliee Hills, Road, Tollywood-Movie

అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో ఒక యువతి కారు డివైడర్ ఎక్కించి, అనంతరం బాలకృష్ణ ఇంటి గేటు వైపునకు వెళ్ళింది.బాలయ్య ఇంటిముందు ఈ రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు భారీగా గుమిగూడారు.అంతే కాకుండా అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో కొద్దిసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది.

ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలను పంపించేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube