కారు నడపొద్దన్నందుకు ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏం చేసిందో తెలుసా..

నేటి సమాజంలో ఎవరు దేనికి హర్ట్ అవుతున్నారో చెప్పడం చాలా కష్టంగా తయారయింది.చిన్న, చిన్న మాటలకే హర్ట్ అవుతూ చెప్పరాని అఘాయిత్యాలు చేసుకుంటున్నారు.

 Do You Know What This Software Engineer Did To Drive The Car , Software Engineer-TeluguStop.com

పిల్లాపాపలతో హాయిగా ఉండాల్సిన జీవితంలో నిప్పులు పోసుకుంటున్నారు.ఇక లక్షల్లో జీతాలు అయ్యాక ఈ కల్చర్ మరింత ఎక్కువయింది.

మాకు మేమే బాస్.మమ్మల్ని అనే వారు ఎవరు అంటూ చెలరేగిపోతున్నారు.

తమకు ఎవరైనా ఎదురు చెప్పినా కానీ తమకు కావాల్సింది ఎవరైనా వద్దన్నా కానీ చెప్పరాని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.వారి పిల్లలను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.నగరంలోని జేవీజే హిల్స్ ఉబెర్ హైట్స్ లో నివాసముండే సుభాషిణి చేసుకున్న అఘాయిత్యం వైరల్ గా మారింది.

ఈ ఘటన వెనుక ఉన్న కారణాన్ని చూసి పోలీసులే కంగుతిన్నారు.ఏంటి ఇలా కూడా చేసుకుంటారా.

అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జేవీజే హిల్స్ లో ఉండే సుభాషిణి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కొలువు చేస్తుంది.

ఈ తరుణంలోనే ఆమె సొంతంగా ఇటీవల ఓ కారు కొనుక్కుంది.సుభాషిణి చాలా రోజుల క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది.

ఆమెకు ఇంటర్ చదివే ఒక కుమారుడు కూడా ఉన్నాడు.లక్షల్లో జీతం కావడంతో సుభాషిణికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.

సుభాషిణి జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది.కానీ ఇటువంటి తరుణంలోనే సుభాషిణికి ఇటీవల ఆరోగ్యం పాడయింది.

ఆమె ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది.దీంతో వైద్యులు ఆమెను కారు, బైక్ వంటివి నడపొద్దని వైద్యులు సూచించారు.

కానీ సుభాషిణి అంతకు కొన్ని రోజుల ముందే ఒక కారు కొనుక్కుంది.వైద్యులు కారు నడపొద్దని చెప్పడంతో సుభాషిణి తీవ్ర మనస్థాపానికి గురయింది.

శనివారం రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరేసుకుంది.పోలీసులు ఈమె హత్యకు కారణం మానసిక ఒత్తిడే కారణం అని తేల్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube