చందుపట్ల సర్పంచ్ పాండుపై సస్పెన్షన్ వేటు

యాదాద్రి భువనగిరి జిల్లా:చందుపట్ల గ్రామ సర్పంచ్ చిన్నం పాండుపై సస్పెన్షన్ వేటు పడింది.పంచాయతీ నిధులను పక్కదారి పట్టించి,అవినీతి,అక్రమాలకు పాల్పడ్డాడని వచ్చిన ఆరోపణలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,డీఎల్పీవో యాదగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమగ్ర విచారణ చేపట్టారు.

 Suspension Hunting On Chandupatla Sarpanch Pandu-TeluguStop.com

నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడంతో సర్పంచ్ పాండుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో సర్పంచ్ సస్పెన్షన్ కు గురైనట్టు డీపీవో సునంద తెలిపారు.

గతంలో గ్రామ పంచాయతీ నిధుల అవినీతి అక్రమాలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి విజయశాంతిని కలెక్టర్ సస్పెండ్ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube