కంపరస్ & కంట్రోల్ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి :ఆటోనగర్ ఎంప్లాయిస్ యూనియన్

కంవైరస్ & కంట్రోల్ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు బోనస్, జీతాలు ఇవ్వాలని, నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది.గాజువాక ఆటోనగర్, పెందుర్తి ఆటోనగర్, ఎస్ బి సి డాక్యర్డ్ ఐఎస్ రాంబిల్లి డాక్ యార్డ్ ప్రాంతాల్లో సుమారు 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.

 Compress Control Illegal Lockout Should Be Lifted Workers Should Be Hired Auton-TeluguStop.com

వీరికి కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలి.కాని సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం జీతాలు కొంత మేరకు ఇస్తున్నారు.

సెలవులు, ఓటి, సగంమందికి పిఎఫ్, ఇఎస్ఐ లాబాలకు అనుగుణంగా బోనస్ ఇవ్వటం లేదు.జీతాలు పెంచడడం లేదు.

చాలాసార్లు అడిగాము.సురేష్ గారు హీనంగా చూస్తున్నారు.

అందుకనే యూనియను పెట్టుకున్నాము.కార్మికులందరూ ఐక్యంగా వున్నాము.

గాజువాక ఆటో నగర్ పరిశ్రమ నడుస్తుండగానే 5గురు కార్మికులను ఏ కారణం చెప్పకుండా తొలగించారు.ఈ నెల 2వ తేదీ నుండి నిలుపుదల చేయడం జరిగింది.

ఉగాదికి బోనస్ ఇవ్వడం, జీతాలు పెంచడం ప్రతి సం॥రం ఉగాది కీ ఇచ్చేవారు, కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు.జీతాలు పెంచలేదు.

కనీసం యజమాని (సురేష్) చర్చలు కూడా చేయకుండా కంపెనీకి రాకుండా వ్యవహరిస్తున్నారు.

కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేసారు.

అయినా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుంది.

ఏప్రిల్ 2వ తేదీన ఉగాది అయ్యింది.

ఆ రోజు బోనస్ ఇస్తామని చెప్పారు.తరువాత వారం రోజులు వాయిదా వేస్తారు.

తరువాత కార్మికులందరం అనగడం వలన ఏప్రిల్ 30వ తేదీ లోపు బోనస్ ఇస్తామని చెప్పి యాజమాని సురేష్ గారు మాట ఇచ్చారు.అమలు చేయలేదు.

కాని పెందుర్తి ఆటో నగర్లో ఉన్న సగం పని అయిన వస్తువులను రాత్రికి, రాత్రి వేరే ప్రాంతానికి తరలించారు.బోనస్ ఇవ్వండని అడిగినందుకు కార్మికులపై కక్ష కట్టి వ్యవహటస్తున్నారు.

ఇప్పటికైన లేబర్ కమీషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని నిలుపుదల చేసిన కార్మికులను విధులోనికి తీసుకోనేలా చేయాలని, వెంటనే బోనస్ ఇవ్వాలని, జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి జగన్ పెందుర్తి జోన్ అధ్యక్షులు శంకర్రావు నాయకులు బి రమణి అప్పల్ నాయుడు కంట్రోల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ దేవుడు వేణు ప్రదీప్ అప్పారావు మురళి సంజయ్ ప్రకాష్ మురళి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube