సర్కారు వారి పాట సినిమాలో మెహర్‌ రమేష్ పాత్ర ఏంటి బాసూ?

సర్కారు వారి పాట సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది.అభిమానులు చాలా మంది ఫస్ట్‌ హాఫ్ బాగుంది.

 What Doing Mehar Ramesh In Sarkaru Vaari Pataa Movie Sets Mehar Ramesh, Sarkar-TeluguStop.com

రెండవ సగం విషయంలో విమర్శలు చేస్తున్నారు.కొందరు మాత్రం సినిమా పూర్తి గా నిరాశ పర్చింది అంటున్నారు.

సినిమా మిశ్రమ స్పందన కు రక రకాలుగా కారణాలు చూపిస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.

ఈ సమయంలోనే కొందరు మెహర్‌ రమేష్ పేరు ను కూడా ప్రస్థావనకు తీసుకు వస్తున్నారు.దర్శకుడు పరశురామ్‌ కొత్త దర్శకుడు మరియు ఆయన అంత పెద్ద స్టార్‌ ను హ్యాండ్‌ చేసిన చరిత్ర లేదు.

కనుక ఆయన కు ఇబ్బంది కాకుండా మెహర్ రమేష్ ను ఈ సినిమా యొక్క ముఖ్య పనులు చూసుకునేందుకు నియమించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆయన ఈ సినిమా లో ఉండటం వల్లే ఈ ఫలితం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది.

మెహర్‌ రమేష్ ను కొందరు తీవ్రంగా విమర్శించే మహేష్ బాబు అభిమానులు ఉన్నారు.

అలాంటి మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు సర్కారు వారి పాట లో ఆయన ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యం లో మహేష్ బాబు పై విమర్శలు చేస్తున్నారు.మెహర్‌ రమేష్ తో చాలా పెద్ద అనుభవం అయినా కూడా ఇంకా ఎందుకు మహేష్‌ బాబు ఆయన్ను నమ్ముతున్నాడు.

ఎందుకు మెహర్‌ రమేష్ కు మరియు మహేష్ బాబుకు మద్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి అంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు.

Telugu Keerthi Suresh, Mahesh Babu, Mehar Ramesh-Movie

అసలు విషయం ఏంటీ అనేది మాత్రం వారికే తెలియాలి.కొందరు అభిమానులు మాత్రం మెహర్‌ రమేష్ ఉండటం వల్ల ఈ ఫలితం వచ్చింది అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేస్తున్నారు.అయినా మెహర్‌ రమేష్‌ అసలు సర్కారు వారి పాట సినిమా వర్క్ లో భాగస్వామ్యం అవ్వలేదు.

ఆయన సినిమా పనిలో ఆయనే బిజీగా ఉన్నాడు.కనుక పుకార్లను ఆపడం ఉత్తమం అంటూ కొందరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube