కె.జి.ఎఫ్ 2 ఈ సినిమా రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కె.
జి.ఎఫ్ చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ కాగా భారీ అంచనాలతో వచ్చి చాప్టర్ 2 కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంది.1100 కోట్ల కలక్షన్స్ తో కె.జి.ఎఫ్ 2 ఇండియన్ బాక్సాఫీస్ పై తన ప్రతాపం చూపించింది.హిందీలోనే ఈ సినిమా 410 కోట్లు కలెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
సినిమా రిలీజై 25 రోజులు అవుతున్నా సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఇక ఈ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ డైరక్టర్ రవి బస్రూర్ పాత్ర చాలా పెద్దదని చెప్పొచ్చు.
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలోని మెహబూబా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.సినిమా రిలీజ్ తర్వాత వీడియో సాంగ్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది.ఈమధ్యనే ఎదగరా సాంగ్ రిలీజై సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా మెహబూబా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.సినిమాలో యశ్, శ్రీ నిధి శెట్టిల జోడీ అదిరిపోయింది.







