ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బైరోజు ముత్తులింగాచారి తన కుమార్తెను నారా చంద్రబాబు నాయుడి గారి సహకారంతో 2010 లో చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యాభ్యాసాన్ని అందించి అనంతరం బీ టెక్ ఫ్రీ కోచింగ్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పించి ఉద్యోగంలో స్థిరపడే విధంగా సహాయం పొందిన బై రోజు పావని కి ఇటీవలే వివాహం కుదిరింది దానికిగాను ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయంగా వారి ఇంట్లో పెళ్లికి తన సొంత ఖర్చులతో సుమారు 15000 వేల రూపాయల గల మంగళ సూత్రం చేయించి ఈ రొజు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం లో ఇవ్వడం జరిగింది.వారితో పాటు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్,గుత్తా సీతయ్య,రాష్ట్ర కార్యదర్శి నాగండ్ల మురళి, టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి కాసాని బ్రంహం, లేళ్ల లక్ష్మణ్, రంగోలి శ్రీనివాస్, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.







