నమ్రతను అందుకే పెళ్లి చేసుకున్నా.. మహేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బి.గోపాల్ డైరెక్షన్ లో మహేష్, నమ్రత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన వంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు.

 Mahesh Babu Shocking Comments About Namrata Goes Viral In Social Media , Mahesh-TeluguStop.com

అయితే మహేష్ నమ్రత ప్రేమలో పడటానికి ఈ సినిమా కారణమైంది.వీళ్లిద్దరి లవ్ స్టోరీ గురించి చాలామందికి తెలియకపోయినా పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగా ఉన్నారు.

వయస్సులో మహేష్ బాబు కంటే నమ్రత పెద్ద అనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారు.

మహేష్ బాబు, నమ్రత కలిసి సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే మహేష్ బాబు అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.అయితే సర్కారు వారి పాట ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబుకు నమ్రతలో మీకు నచ్చిన విషయం ఏమిటని ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నమ్రతలో తనకు అన్నీ నచ్చాయని అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని మహేష్ అన్నారు.

మహేష్ బాబు చెప్పిన ఈ స్వీట్ ఆన్సర్ నెట్టింట వైరల్ అవుతుండగా మహేష్ బాబు అభిమానులు సైతం ఈ జవాబు విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.

మరోవైపు సర్కారు వారి పాట మూవీకి బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి.ఈ సినిమాకు ఫస్ట్ డే టికెట్స్ దొరకడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సర్కారు వారి పాట ఖాతాలో రికార్డులు చేరుతున్నాయి.

Telugu Mahesh Babu, Maheshbabu, Namrata-Movie

సర్కారు వారి పాట ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోల్చి చూస్తే ఈ సినిమాకు అదనంగా 25 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా కలెక్షన్లు కూడా అదే విధంగా ఉండబోతున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సర్కారు వారి పాట రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube