టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట‘ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఇప్పటికే ఈ సినిమ నుండి వచ్చిన ట్రైలర్, పోస్టర్స్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.ఈ సినిమాలో మహేష్ బాబు మరింత అందంగా, యంగ్ గా వింటేజ్ లుక్ తో లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు.
ఇక రేపే ఈ సినిమా రిలీజ్ ఉండడంతో మహేష్ వరుస ఇంటర్వ్యూలు చేస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నాడు.
తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
మాములుగా పలు రకాల మిమిక్రీ ఆర్టిస్టులు స్టార్ హీరోల వాయిస్ లను మిమిక్రీ చేస్తూ ఉంటారు.కొందరయితే యాజిటీజ్ చేస్తూ ఎవరు అసలు వాయిస్ ఎవరిదీ నకిలీ అని చెప్పలేక పోయేలా అద్భుతంగా చేస్తూ ఉంటారు.
అయితే ఈ విషయంపై మహేష్ బాబుని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

దీని గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.తన వాయిస్ ను ఎవరు మిమిక్రీ చేయలేరని తెలిపారు.తన వాయిస్ క్యాచ్ చేయడం అంత ఈజీ కాదని అందుకే ఎవరు చేయలేరని మహేష్ తెలిపారు.
కొంత రేంజ్ వరకు ఓకే కానీ పూర్తి స్థాయిలో ఎవరు చేయలేరని మహేష్ నొక్కి చెప్పారు.ఇక సినిమా గురించి చెబుతూ.ఈ సినిమాలో తనకు కళావతి పాట బాగా నచ్చిందని తెలిపారు.అలాగే కీర్తి సురేష్ పాత్ర సుర్ప్రైజింగ్ గా ఉంటుందని.
నేనున్నాను.నేను విన్నాను అనే డైలాగ్ ఎందుకు పెట్టామో సినిమా చుస్తే అర్ధం అవుతుందని ఇది పొలిటికల్ ఇంటెన్షన్ కాదని వివరించారు.







