ఆంధ్రప్రదేశ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించాలని జనసేన పార్టీ సిద్ధమవుతుంది.ముఖ్యమంత్రి జగన్ నే టార్గెట్ గా పెట్టుకున్న పవన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సర్వ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అయితే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోత్తుగా ఎన్నికల రంగంలోకి దిగి వైసీపీ పార్టీని ఓడిస్తారని భయం వైసీపీ నేతలకు ఆందోళన కలిగిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటివల వైసీపీ నేతలపై తీవ్ర కామెంట్ చేసిన పవన్ పై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.
విపక్షాల ఐక్యత ఏర్పాటుపై జనసేన అధినేత, టీడీపీ అధినేత చేస్తున్న వాదనలను ఆయన ఖండించారు.ముందుగా ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను కోరారు.
వైసీపీ పార్టీని ఓడించాలని ఆలోచించే ముందు రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా ఎమ్మెల్యేగా గెలవాలని జనసేన అధినేతకు సలహా ఇవ్వాలని ఆయన కోరారు.రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా తన కుమారుడు లోకేష్, పెంపుడు కొడుకు పవన్‌కల్యాణ్‌ను అసెంబ్లీకి గెలిపించాలని మాజీ మంత్రి టీడీపీ అధినేతను కోరారు.2019 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో గట్టిపోటీని చూశారని అన్నారు.

అయితే వైసీపీ పార్టీని ఓడించడం గురించి మాట్లాడే ముందు లోకేశ్, పవన్‌లను గెలిపించడమే కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలకు కనీసం ఒక్క అసెంబ్లీ సీటు అయినా గెలవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లకు వైసీపీ నేతలు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 అసెంబ్లీ స్థానాలను నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలని వైసీపీ పార్టీ ఇద్దరు నేతలకు అంటున్నారు.
అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి ఎన్నికల పొత్తుకు నోచుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటుందని… ఎన్నికలకు రెండేళ్ల ముందు టీడీపీ, జనసేన నేతలు పొత్తు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.







