ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం విఫలం:- సిపిఎం పార్టీ నిరసన

ఖమ్మం నగరంలో క్షేత్ర స్థాయిలో వున్న ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో టి ఆర్ ఎస్ పాలకవర్గం విఫలం అయింది అని, పేపర్ ప్రకటనల్లో మాత్రమే అభివృద్ధి కనపడుతుంది అని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.వ్యవసాయ కార్మిక సంఘం, సి ఐ టి యూ, ఐద్వా, డీ వై ఎఫ్ ఐ ప్రజా సంఘాల ఖమ్మం అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

 Municipal Corporation Ruling Fails To Address Public Concerns: - Cpm Party Prote-TeluguStop.com

ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ శివారు ప్రాంతాలను కార్పొరేషన్ లో విలీనం చేయడం ఫలితంగా ప్రజలపై పన్నుల భారం ఎక్కువ వేసి పనులు మాత్రం తక్కువగా చేస్తున్నారు అని ఆరోపించారు.నగరంలో కూడా ఒక్క ప్రాంతం చుట్టూ మాత్రమే అభివృద్ధి జరుగుతుందని , కీలకమైన శివారు ప్రాంతాల్లో అభివృద్ధి ని పట్టించుకోవడం లేదు అని, మెయిన్ రోడ్ లపై లైట్లు పెడితే సరిపోదని శివారు ప్రాంతాల్లో లైట్ లు కూడా లేవు అని విమర్శించారు.

వరుసగా ఐదు రోజులు పాటు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాల ద్వారా ప్రజా సమస్యలను TRS ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళుతున్నామని సమస్యలు పరిష్కారం కాకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు M భారతి, యర్రా శ్రీకాంత్, వై విక్రమ్, నవీన్ రెడ్డి, బత్తిని ఉపేంద్రర్, పి నాగేశ్వరరావు, నాగమణి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube