ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.2008 సంవత్సరంలో ప్రారంభమైన డిగ్రీ కళాశాల నేలకొండపల్లిలోని కూసుమంచి రోడ్డులో 2021 వ సంవత్సరం నూతన భవనం నిర్మించబడి ప్రస్తుతం తరగతులు జరుగుతున్నాయన్నారు.కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.గతంలో కళాశాలలో విద్యనభ్యసించి వివిధ హోదాల్లో ఉన్న ప్రతీ పూర్వ విద్యార్థి ఇందులో సభ్యుడిగా చేరి కళాశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
కళాశాలకు అనుబంధంగా రెండు హాస్టళ్ళ నిర్మాణం జరుగుతున్నాయన్నారు.విద్యార్థినీ, విద్యార్థులకు వేరు వేరుగా హాస్టల్ వసతి వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం న్యాక్ పరిశీలనకు కళాశాల వెళ్తుందని ఈ న్యాక్ లో మంచి గ్రేడ్ సాధిస్తే కళాశాల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు.కావున పూర్వ విద్యార్థులందరూ తప్పకుండా కళాశాలకు వచ్చి పూర్తి వివరాలు,తమ ఫోన్ నెంబర్లు అధ్యాపకులకు ఇచ్చి పేర్లు నమోదు చేసుకుని కళాశాలలో జరిగే పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనాలన్నారు.
అలాగే ప్రతి పూర్వ విద్యార్థి కళాశాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె కోరారు.







