ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో దుబాయ్‌లో పనిమనిషిగా పనిచేస్తున్న భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ వచ్చిన నిందితుడిని ఇక్కడి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతనిని సోమవారం సిటీ కోర్టులో హాజరుపరచగా.న్యాయమూర్తి అతడికి జ్యూడీషియల్ కస్టడీ విధించారు.
నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన సాహెబ్ అలీగా గుర్తించారు.ఇతను దుబాయ్‌లోని ఓ షేక్ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
అతని నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తున్నాయని.తనను వెంబడిస్తున్నాడని ఫిబ్రవరి 1న గుర్గావ్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
తనకు వీడియో కాల్స్ చేస్తూ.అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపుతున్నాడని మానేసర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదులో పేర్కొంది.ఈ అర్ధంలేని పనిని ఆపమని తాను అతనిని హెచ్చరించినట్లు మహిళ పేర్కొంది.అయినప్పటికీ అతని తీరు మారకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 డి (స్టాకింగ్), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద అభియోగాలు నమోదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులకు నిందితుడు సాహెబ్.ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లినట్లు తేలింది.దీంతో అతనిపై లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలో సాహెబ్ ఆదివారం దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.అయితే పోలీసుల విచారణలో తనకు ఆ మహిళ ఎవరో తెలియదని నిందితుడు బుకాయించే ప్రయత్నం చేశాడు.
అంతేకాకుండా తన మెసేజ్‌లకు ఆమె సమాధానం ఇచ్చిన తర్వాతే అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపానని సాహెబ్ అంగీకరించాడు.