వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు వున్న జనాదరణ గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు.
అందుకే యూజర్ల దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ అనేక అప్ డేట్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది.యూజర్లను సంతృప్తి పరిచే లక్ష్యంతో ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్లు యూజర్లకు కూడా తెగ నచ్చుతూ ఉంటాయి.అలా వాట్సాప్ యూజర్ బేస్ రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది.
మార్కెట్లో ఎన్ని పోటీ యాప్స్ వచ్చినా కానీ వాట్సాప్ ను ఢీ కొట్టిన యాప్ ఇంతవరకు రాలేదంటే నమ్మితీరాల్సిందే.ఈ క్రమంలో వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ముఖ్యంగా గ్రూప్ చాటింగ్ చేసుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.ఈరోజు వరకు వాట్సాప్ లో ఉన్న గ్రూపుల్లో కేవలం 256 మందిని మాత్రమే సభ్యులుగా చేర్చే అవకాశం ఉండేది.
అంత కంటే లిమిట్ ఎక్కువ అయితే సభ్యులను యాడ్ చేయడం వీలు అయ్యేది కాదు.అయితే యూజర్ల కోరిక మేరకు వాట్సాప్ ఇప్పుడు ఈ నంబర్ ను డబుల్ చేసింది.
ఇక మీదట నుంచి వాట్సాప్ గ్రూప్ లో 512 మందిని యాడ్ చేసుకొనే వెసులుబాటు కలదు.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంది.
త్వరలో ఈ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది.

ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న వాట్సాప్ తాజాగా గ్రూప్ సభ్యుల ఫీచర్ ను కూడా యాడ్ చేయడం హర్షణీయం.అంతే కాకుండా, కమ్యూనిటీ గ్రూప్ చాట్ పేరుతో ఫీచర్ ను కూడా యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా వివిధ గ్రూప్స్ వారి దైనందిత కార్యక్రమాలకు మంచి వేదిక కానుంది ఈ ఫీచర్.
తద్వారా వారి ఎక్కువమందితో టచ్ లో వుండే వెసులుబాటు కలదు.ఈ కమ్యూనిటీ గ్రూప్ చాట్ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇవే కాకుండా మరో గుడ్ న్యూస్ ను కూడా వాట్సాప్ తన యూజర్లకు చెప్పింది.ఇప్పటి వరకు వాట్సాప్ లో 100 సైజులో ఉండే ఫైల్స్ ను మాత్రమే పంపించుకునేందుకు వీలుండేది.
కానీ ఇక నుంచి ఆ సైజును 2జీబీకి పెంచనున్నట్లు వాట్సాప్ తెలపడం గమనార్హం.







