టీడీపీ-జ‌న‌సేన సీక్రెట్ పొత్తు.. సీట్ల పంప‌కాలు ఇలా ఉన్నాయ‌ట‌..!

ఏపీలో పొత్తు రాజకీయాలపై జోరుగా చర్చ నడుస్తోంది.ప్రధాన పార్టీల నేతలందరూ పొత్తుల మీదే కామెంట్లు చేస్తున్నారు.

 Tdp Janasena Secret Alliance Seat Distribution Is As Follows , Tdp , Janasena ,-TeluguStop.com

బీజేపీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ మేరకు ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ఒప్పందానికి కూడా వచ్చారని కొందరు నేతలు మాట్లాడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 175 సీట్లు ఉండగా.జనసేనకు 40 నుంచి 45 సీట్లను టీడీపీ కేటాయించే అవకాశం ఉందని .లోక్‌సభ సీట్ల విషయానికి వస్తే 5 నుంచి 6 సీట్ల వరకు దక్కవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది.అన్ని జిల్లాలలో జనసేన సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఇచ్చాపురం, పాలకొండ స్థానాలు.విజయనగరంలో ఎస్.కోట, నెల్లిమర్ల స్థానాలు.విశాఖలో భీమిలి, అరకు లేదా పాడేరు, యలమంచిలి, పెందుర్తి స్థానాలు జనసేనకు కేటాయిస్తారట.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పిఠాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజానగరం, రాజోలు, అమలాపురం.పశ్చిమగోదావరిలో నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, తణుకు, ఉంగుటూరు స్థానాలు.

కృష్ణాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, కైకలూరు, నూజివీడు, పెడన స్థానాలు.గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి, తెనాలి, వేమూరు.

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, చీరాల.నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ ఉన్నాయట.

Telugu Alliance, Andhra Pradesh, Ap Assembly, Chandrababu, Janasena, Pawan Kalya

చిత్తూరు జిల్లాలో చూస్తే తిరుపతి, శ్రీకాళహస్తి.అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్, కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆలూరు.కడప జిల్లాలో రాజంపేట, మైదుకూరు స్థానాలను జనసేనకు కేటాయిస్తారట.లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే.అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, చిత్తూరు, రాజంపేట ఉన్నాయట.అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ సీట్ల కేటాయింపులో వాస్తవమెంతో టీడీపీ, జనసేన నేతలకే తెలియాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube