పక్కా మాస్.. ఇప్పుడిదే హిట్ ఫార్ములా గురూ?

సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని జోనర్లు ఉన్న ఎందుకో మాస్ జనానికి మాత్రం ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

 Mass Formula Spread All Over Movie Industry Mass Formula, Kgf 2, Yash , Allu A-TeluguStop.com

మాస్ జోనర్ అంటే చాలు భారీగా థియేటర్లు కు తరలి వెళుతుంటారు ప్రేక్షకులు.ఇక ఎప్పుడూ బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ సమర్థవంతంగా ఢీ కొడుతుంది అంటే దానికి కారణం కూడా మాస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కాగా మాస్ కీ బ్రాండ్ అంబాసిడర్గా సలాం రాఖీ భాయి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఉపేసాడు.కన్నడ హీరో యష్.మాస్ ఎలివేషన్స్ తో సినిమా తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది.ఇక ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు.

హిందీ పరిశ్రమలో ఏ సినిమాకి సాధ్యం కానీ 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా.ఇక 1150 కోట్లకు మించిన వసూళ్లు సాధించింది.

అయితే కే జి ఎఫ్ తో మాస్ యాక్షన్ అటు పుష్ప సినిమాతో బాలీవుడ్ లో మరింతగా ఎలివేట్ అయింది.ఈ క్రమంలోనే ఇలా సౌత్ సినిమాలు హిట్ సాధిస్తూ ఉండటం అటు బాలీవుడ్ లోని ప్రముఖులందరూ ఊహించని షాక్ ఇస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి పీడకలలు మిగులుస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కే జి ఎఫ్ సినిమా హిట్ తర్వాత అటు భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప సినిమా కూడా మాస్ ఎలివేషన్స్ తోనే సూపర్ హిట్ అయింది అని చెప్పాలి.

Telugu Akhanda, Allu Arjun, Bala Krishna, Bheemla Nayak, Boyapati, Kgf, Mass For

ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఇక మాస్ ఎలివేషన్స్ ఉండడంతో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది.అంతేకాదు పుష్పరాజ్ పాత్ర జనాల్లో ఒకరిగా మారిపోయింది.ఎన్నో రోజుల పాటు తన హవా నడిపించాడు.ప్రేక్షకుల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా పుష్ప మేనియా లో మునిగిపోయారూ అని చెప్పాలి.

కేవలం సౌత్ లోనే బాలయ్య మాస్ ఎలివేషన్స్ ఉన్న అఖండ సినిమాతో వచ్చి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.మరోవైపు భీమ్లా నాయక్ మాస్ జోనర్ గానే బాగా హిట్ అయింది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube