వైరల్: నీళ్లలో వుండే 'జెల్లీ ఫిష్' ఆకాశంలోకి ఎగిరిందేంటబ్బా! ఒకసారి చూసేయండి మరి!

మనోళ్లు ఈ మధ్య కాలంలో ఇంట్లో కాకుండా నెట్టింట్లో ఎక్కువగా గడుపుతున్నారు.అలాంటివారిని ఆహ్లాదంగా ఉంచడం కోసం ప్రతిరోజూ ఎన్నో వీడియోలు దాంతో సందడి చేస్తుంటాయి.

 The 'jellyfish' In The Water May Have Flown Into The Sky Jelly Fish, Viral Lat-TeluguStop.com

వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలో బాగా వైరల్ అవుతున్న వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.దాన్ని చూస్తే సముద్రంలో వుండే జెల్లీ ఫిష్‌లు, ఆకాశంలో చెక్కెర్లు కొడుతున్నాయేంటి అనే అనుమానం కలగక మానదు.

అవును, ఇలాంటి వింత జెల్లీ ఫిష్ దక్షిణ అమెరికాలో తాజాగా కనిపించింది.

అయితే ఇది మామ్మూలు జెల్లీ కాదండోయ్.

మిస్టీరియస్ స్పేస్ జెల్లీ ఫిష్.ఇక ఇది చూసి అక్కడి జనాలు అంతా నోరెళ్లబెడుతూ చూస్తుండిపోయారంట.

అసలు విషయంలోకి వెళితే, జార్జియాలోని మే 5 ఉదయం వేక్రాస్‌లో ఆకాశంలో కదులుతున్న ఒక రహస్య వస్తువుని అక్కడివారు వింతగా తిలకించడం స్థానికంగా సంచలనంగా మారింది.ఇది పదునైన మెరిసే వస్తువులా తెల్లిన ఆకారంలో ఉంది.

అయితే, ఇది ఖచ్చితంగా స్పేస్ జెల్లీ ఫిష్ లాగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోను శాన్ ఆంటోనియోలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఏరోడైనమిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ క్రిస్ కాంబ్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈమేరకు, స్పేస్ జల్లీ ఫిఫ్ అంటూ క్యాఫ్షన్ అందించారు.కాగా ఈ స్పేస్ జెల్లీ ఫిష్ UFO కాదని, క్రిస్ కాంబ్స్ పేర్కొన్నారు.ఇది కెమెరాకు దాదాపు 400 కిమీ దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం అంటూ ఇతను తెలిపాడు.కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ రాకెట్లు లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరుతాయి.

అయితే వాటిలో కొన్ని ఆకాశంలో ఇలాంటి ఆకారంలో అపుడపుడు కనిపిస్తాయట.కాంబ్స్ ప్రకారం, ఇది ఫిజిక్స్‌తోపాటు పర్ఫెక్ట్ టైమింగ్ కలయికలో ఏర్పడిందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube