బంగారం అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి.డబ్బుల తరువాత ప్రతి ఒక్కరు కూడా బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
బంగారాన్ని కరిగించి వివిధ రకాల అందమైన ఆభరణాలను తయారు చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాటి బంగారు నగలు తయారుచేసే కర్మాగారం ఒకటి తవ్వకాల్లో బయటపడింది.
అసలు వివరాల్లోకి వెళితే హరప్పా నగరంలో దాదాపు 5వేల సంవత్సరాల నాటి బంగారు ఆభరణాలను తయారు చేసే కర్మాగారపు అవశేషాలను పరిశోధకులు కనుగొన్నారు.అయితే ఆ కాలంలోనే ఈ నగరం నుంచి బంగారం వ్యాపారం కూడా జరిగినట్లు తెలుస్తుంది.
అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి కాలంలోనే ఈ నగరంలోని బంగారు కర్మాగారన్ని ఎంతో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది.ఇప్పుడు పెద్ద నగరాల నిర్మాణానికి ఉపయోగిస్తున్న అన్ని టెక్నిక్‌లు, స్ట్రెయిట్ వీధులు, డ్రెయిన్‌లు, చెత్త కోసం డస్ట్‌బిన్‌లు అన్నిటిని కూడా కొన్ని వేల సంవత్సరాల కాలంలోనే ఉపయోగించినట్లు తెలుస్తుంది.
ఈ తవ్వకాల్లో బంగారు నగలతో పాటు ఇద్దరు మహిళల అస్థిపంజరాలు కూడా దొరికినట్లు అధికారులు తెలిపారు.అస్థిపంజరాలతో పాటుగా కొన్ని పాత్రలను కూడా అక్కడే పాతిపెట్టినట్లు గుర్తించారు.
ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) కొత్త త్రవ్వకాలను నిర్వహిస్తోంది.ఈ నెల అంటే మే చివరి నాటికి తవ్వకాలను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
హరప్ప నగరంలోని రాఖీగర్హి అనేది హరప్పా నాగరికతతో వెలిసిన అతిపెద్ద పురావస్తు ప్రదేశం.అప్పట్లోనే ఎంతో ఆధునిక టెక్నాలజిని ఉపయోగించి ఈ నగరాన్ని నిర్మించారు.
ఈ రాఖీగర్హి అనేది హరప్పా సంస్కృతి ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రంగా ఇప్పటికి పరిగణించబడుతుంది.దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు ఉపయోగించే ఈ టెక్నాలజీని మన పూర్వికులు కొన్ని వేల సంవత్సరాల నాడే ఉపయోగించినట్లు తెలుస్తుంది.







