ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఇంద్రజ ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఇంద్రజ తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.
జీవితంలో జరిగిన సాడ్ మూమెంట్ గురించి ఇంద్రజ మాట్లాడుతూ 1998 సంవత్సరంలో మేము ఒక ఫ్లాట్ కొన్నామని ఆ ఫ్లాట్ కోసం చేతిలోని ఉన్న డబ్బంతా ఖర్చు చేశామని ఆమె తెలిపారు.
కరెక్ట్ గా అదే సమయంలో అమ్మకు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని అమ్మకు వాల్వ్ రీప్లేస్ మెంట్ చేయాలని డాక్టర్లు చెప్పారని ఇంద్రజ వెల్లడించారు.
ఆ సమయంలో చేతిలో డబ్బులు అస్సలు లేవని ప్రతి నెలా పని చేస్తే మాత్రమే తాను లోన్ అమౌంట్ ను పే చేయగలిగే పరిస్థితి ఉందని ఇంద్రజ కామెంట్లు చేశారు.అమ్మకు అదే సమయంలో ఆపరేషన్ కూడా చేయాలని వర్క్ చేస్తున్న రెండు కంపెనీలు ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ అయ్యాయని ఇంద్రజ వెల్లడించారు.
ఆ సమయంలో ఎవరిని డబ్బులు అడగాలో తెలియలేదని ఏం చేయాలో అర్థం కాలేదని ఇంద్రజ పేర్కొన్నారు.

ఆ సమయంలో నగలు అవీ ఇవీ చాలా జరిగాయని ఆ తర్వాతే అమ్మకు ఆపరేషన్ చేయడం జరిగిందని ఇంద్రజ చెప్పుకొచ్చారు.అప్పటినుంచి మనీ అనేది నాకు సెకండరీ అయిందని ఎవరికి సహాయం అవసరం అని తెలిసినా నా చేతిలో డబ్బులు ఉంటే వెంటనే చేసేస్తానని ఆమె అన్నారు.నా లైఫ్ లో అది చాలా క్రిటికల్ మూమెంట్ అని ఇంద్రజ కామెంట్లు చేశారు.

ఆ సమయంలో అమ్మను కాపాడుకుంటానో లేదో అనే భయం వచ్చిందని ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత 15 సంవత్సరాల పాటు అమ్మవాళ్లు ఉన్నారని ఇంద్రజ పేర్కొన్నారు.ఇంద్రజ కన్నీటి కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.







