సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో రూపొందిన సర్కారు వారి పాట ఈనెల 12న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.సినిమా విడుదల నేపథ్యం లో మహేష్ బాబు అభిమానులకు ఒక ఓపెన్ లెటర్ ను రాయడం జరిగింది.
ఓపెన్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓపెన్ లెటర్ ను మహేష్ బాబు ఇప్పుడు కొత్తగా రాయడం లేదు.
ఆయన గతంలో కూడా అభిమానులకు లెటర్ లను రాయడం జరిగింది.గతం లో పోకిరి సినిమా కోసం మహేష్ బాబు అభిమానులకు లేఖ రాశాడు.ఆ సమయంలో ఎలా అయితే తన అభిమానులను ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరాడో అచ్చు అలాగే సర్కారు వారి పాట సినిమా సక్సెస్ కావాలనే ఉద్దేశ్యం తో సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరాడు.
అప్పట్లో పోకిరి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆ సినిమా స్థాయి లో ఈ సినిమా కూడా తప్పకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.సర్కారు వారి పాట సినిమా కు ఇప్పటికే కుమ్మేస్తుంది అనేంత హైప్ వచ్చింది.కనుక ఖచ్చితంగా ఈ సినిమా దుమ్ము దులిపే విధంగా వసూళ్లను దక్కించుకుంటుంది.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమా ను చాలా మంది పోకిరి మరియు దూకుడు అంటున్నారు.ఆ రెండు సినిమా లను కలగలిపి ఈ సినిమా కుమ్మేస్తుందనే అనే టాక్ సెంటిమెంట్ వ్యక్తం అవుతుంది.పోకిరి సినిమా కు అప్పట్లో ఎలా అయితే లేఖ ను మహేష్ బాబు రాశాడో ఇప్పుడు సర్కారు వారి పాట కు లేక రాయడం వల్ల ఖచ్చితం గా సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.







