హరీష్ రావుకు సుభాషన్న బహిరంగ లేఖ

సూర్యాపేట జిల్లా: దుర్గంధంలో మగ్గుతున్న రోగులను కాపాడాలి, సర్కారు ఆసుపత్రులను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలి,అపరిశుభ్రతకు నిలయంగా మారిన ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రక్షాళన చేయాలని మంత్రిని బహిరంగ లేఖలో కోరిన ప్రజా ఉద్యమకారుడు బోసన్న.లేఖ పూర్తి పాఠం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయని, కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతోందని ప్రజా ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ సి.

 Subhashanna Open Letter To Harish Rao-TeluguStop.com

పి.ఐ.(ఎమ్-ఎల్) రాష్ట్ర కార్యదర్శి,ప్రజా రత్న అవార్డు గ్రహీత బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఆరోపించారు.ప్రఖ్యాత గాంధీ హాస్పిటల్లోని వార్డుల్లో పిల్లులు సంచరిస్తుంటే,అంతే ముఖ్యమైనవి నిమ్స్ హాస్పిటల్ లో బొద్దింకలు,నల్లుల బెడద సాధారణమైపోయిందని పేర్కొన్నారు.

ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఉందని,రోగులు వుండే వార్డుల్లో వీధి కుక్కలు తిరుగుతున్నాయని, పరిసరాల్లో భరించలేనంతగా దుర్వాసన సాధారణమైపోయిందని తెలిపారు.ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారాన్ని పారేస్తూ ఉండడంతో ఆసుపత్రుల ఆవరణలో అపరిశుభ్రత తాండవిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అనేక చోట్ల సర్కార్ ఆసుపత్రుల్లో మానవ అవయవ వ్యర్థాల నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉందని,రోగుల సహాయకులు ఆరుబయటే పడుకోవలసిన పరిస్థితుల్లో పిల్లులు కుక్కల బెడదతో అల్లాడుతున్నారని హరీష్ రావుకు వివరించారు.వలసాంధ్ర పాలకులు నాడు ప్రభుత్వ హాస్పిటల్స్ పట్ల చూపిన వివక్షత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంతమవుతుందని ఆశించిన వారికి నిరాశనే మిగులుతుందని,ప్రభుత్వ వైద్యరంగంపై కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమను విడనాడాలని,పేద రోగుల పట్ల నిరాదరణ విడనాడి,ప్రైవేటు హాస్పిటల్స్ కు ధీటుగా పరిశుభ్రతకు వేదికలుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

చాలా హాస్పిటల్లో పందులు,గేదెలు,కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని,మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెలువడుతోందని తెలిపారు.ఆసుపత్రుల్లోని వ్యర్ధాలు, శస్త్ర చికిత్సలు,కాన్పు సమయంలో వెలువడే మానవ వ్యర్థాలను ప్లాస్టిక్ సంచుల్లో వేసి మరుగుదొడ్లలో ఉంచుతున్నారని,వారాల తరబడి వాటిని తరలించక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆసుపత్రుల్లో ఏసీలు ఏర్పాటు చేసిన వార్డుల్లోని పైకప్పులో ఎలుకలు నివాసం ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉస్మానియా హాస్పిటల్ కు కుతుబ్ షా భవనం నాలుగోవ అంతస్తులో సంచులను పడేస్తున్నారని,శస్త్రచికిత్స థియేటర్లు వార్డులలో తరచూ రసాయన ప్రక్రియ చేపట్టకపోవడంతో దుర్గంధం నెలకొంటుందని,వార్డుల్లో కుక్కలు, పిల్లులు,పందుల సంచారం మామూలుగా మారిందని, సమీపంలోనే మూసీనది ఉండటంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లోని అన్ని వార్డుల్లోను ఎలుకలు తవ్విన గుంతలు దర్శన మిస్తున్నాయని,మూషికాలు ఎక్కడపడితే అక్కడే పైపులను ధ్వంసం చేస్తున్నాయని,మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం వెనుక భాగంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని,పాముల సంచారం రోగులను,వారి సహాయకులను భయపెడుతోందని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు.

పలు విభాగాలకు నెలవైన గాంధీ ఆసుపత్రి సెల్లార్ లో మ్యాన్ హోళ్లు తరచూ పొంగిపొర్లు తుండడంతో పరిస్థితి దుర్భరంగా ఉందని, డ్రైనేజీలు పొంగి వంటశాల విస్తరించిన బ్లాక్ మొత్తం మురుగు మయంగా మారిందని,పందికొక్కులు, ఎలుకలు చేరి రంధ్రాలు చేస్తున్నాయని,కూరగాయలు తరగడం,వంటలు వండడం,వార్డులోకి తరలించడం వరకు అంతా ఆ మురికి కూపంలోనే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సూర్యాపేట,నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వార్డుల మధ్య చెత్తాచెదారాన్ని, ఖాళీ కొబ్బరిబొండాలు,ఇతర వస్తువులను పడేస్తున్నారని బహుజన వర్గాల రాజ్యాధికార సంఘం (బి.వి.ఆర్) రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల లింగన్న యాదవ్ సెల్ నెంబర్ 9848806382 చెప్పిన విషయాలను మంత్రికి గుర్తు చేశారు.మురుగునీరు విడుదలయ్యే పైపులు పగలడంతో దుర్గంధం వెలువడుతుందని లింగన్న బాధపడుతుంటే, సూర్యాపేట జనరల్ హాస్పిటల్ లో జీవ నిర్వహణపై నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని,ఇటీవల కుక్కలు కొన్ని అవయవ వ్యర్థాలను వీధుల్లోకి తెచ్చి పడేశాయని వేల్పుల లింగన్న యాదవ్ చెప్పాడని, ప్రాంగణంలోనే చెత్తాచెదారం తగలబెట్టడంతో వచ్చే పొగతో వార్డుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.భువనగిరి జిల్లా ఆసుపత్రిలో,వార్డులతో పాటు,ప్రాంగణంలో చెత్త చెదారం నిర్లక్ష్యంగా వదలి వేస్తున్నారని ఆరోపించారు.మహబూబ్ నగర్ ఆసుపత్రికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయలేదని, దీంతో ప్రాంగణంలో పందులు కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని మంత్రి హరీష్ రావు కోసం ప్రాణమిచ్చే వీర భక్తుడు,గత 20 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఆస్తులను కరగదీసి ఉద్యమాలు చేసిన నిజాయితీపరుడు,వనపర్తి జిల్లా,చందాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట విష్ణు మాదిగ సెల్ నెంబర్.9347380189 చెప్పిన మాటలను మంత్రికి గుర్తు చేశారు.మహబూబ్ నగర్ ఆసుపత్రి లోపల బొద్దింకలు,నల్లులు,ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, మురుగునీటి కాలువ నిర్వహణలో సమస్యలు ఉండడంతో ప్రాంగణమంతా దుర్వాసన వెదజల్లుతోందని సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు,నేడు కూలి చేసుకుంటూ వృద్ధ తల్లిదండ్రులను పోషించుకుంటున్న చింతకుంట విష్ణు చెప్పిన విషయాలను హరీష్ రావు దృష్టికి తీసుకొచ్చారు.45 సంవత్సరాల వయసులో విష్ణుకుమార్ ఉన్నాడని,ఉద్యమాల్లో తిరిగి ఆస్తులు పోగొట్టుకోవడంతో విష్ణుకి పిల్లను ఎవరు ఇవ్వకపోవడంతో బ్రహ్మచారిగా బాధపడుతున్నాడని మంత్రి హరీష్ రావు పెద్ద మనసుతో విష్ణుకి న్యాయం చేయాలని కోరారు.కరీంనగర్లో కరోనా అనుమానిత కేసులు వార్డు,సర్జికల్ వార్డులకు ఇరువైపులా ఉన్న ఓపెన్ డ్రైనేజీ ద్వారా ఎలుకలు,పాములు వస్తున్నాయని ప్రజాకవి సిపిఐ(ఎం-ఎల్)నాయకుడు మంద సుదర్శన్ సెల్ నెంబర్.9440490823 చెప్పిన విషయాలను మంత్రికి వివరిస్తూ భరించలేని దుర్వాసనతో రోగులు,సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.కరీంనగర్ లో ఆసుపత్రికి నలువైపులా గేట్లు తీసి ఉంచడంతో ఆవరణలో కుక్కలు,పందులు యథేచ్ఛగా తిరుగుతున్నాయని మంత్రికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా ఆసుపత్రి ఆవరణలో కుక్కలు,ఎలుకలు సంచరిస్తున్నాయని,రోగులు,సహాయకులు తిన్న ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారని ఖమ్మం జిల్లా యాదవ సంఘం నాయకుడు, క్రియేటివ్ డిజైనర్ ఎండి మట్టిపల్లి వెంకట్ యాదవ్, సెల్ నెంబర్:73064 66644 చెప్పిన విషయాలను మంత్రికి వివరించారు.కొత్తగూడెం ఖమ్మం హాస్పిటల్ లోపల భరించలేని దుర్వాసనతో రోగులు,సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని యాదవ మహిళా విద్యావంతుల నాయకురాలు మున్న సునీత యాదవ్ సెల్ నెంబర్ 9948491515 చెప్పిన విషయాలను గుర్తు చేస్తూ కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగులేక మురుగునీరు ఆవరణలో నిలుస్తోందని మున్నా సునీత యాదవ్ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయని,ట్రాన్స్ఫార్మర్ సమస్యలతో తరచూ విద్యుత్ కోత తప్పడం లేదని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయని,పెరిగిన రోగుల తాకిడికి తగ్గట్లుగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేయలేదని దీంతో పారిశుద్ధ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్స్ ను కార్పొరేట్ కు ధీటుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పిన మాటలను వాస్తవరూపం దాల్చుటకు కార్యాచరణ రూపొందించాలని సిపిఐ(ఎం-ఎల్) కార్యదర్శి బోర సుభాషన్న డిమాండ్ చేశారు.

ఆసుపత్రులను వేధిస్తున్న చెత్తాచెదారం నుండి, జంతువుల సంచారం నుండి,దుర్గంధ వాసన నుండి, వ్యర్ధాల నిర్వహణ లోపభూయిష్టం నుండి,పరిపూర్ణ పరిశుద్ధ చికిత్స జరపాలని జన హితాన్ని కాంక్షించే కామ్రేడ్ బోర సుభాషన్న డిమాండ్ చేశారు.ప్రభుత్వ హాస్పిటల్స్ సమస్యలను 9848540078 నెంబర్ కి పంపాలని ప్రజలను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube