మందుబాబులారా! మీకొక తీపి వార్త తీసుకొచ్చాము.ఇక మీరు తెల్లార్లు తాగొచ్చు.
ఎందుకంటే అక్కడ బార్లు తెల్లార్లు ఓపెన్ గానే ఉంటాయి.ఆగండాగండి.
అయితే ఈ అవకాశం ఎవరికో తెలుసుకోండి.దేశ రాజధాని ఢిల్లీలో నైట్ లైఫ్ పెంచే ప్రయత్నంలో భాగంగా, తెల్లవారి 3 గంటల వరకు కూడా మద్యం తాగేందుకు బార్‌లను అనుమతించేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తాజాగా వెల్లడించారు.
ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు ఇందుకు అవసరమైన ఆదేశాలను కూడా జారీ చేయడం కొసమెరుపు.ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భోగట్టా.
ఇకపోతే, సాధారణ బార్ లు కాకుండా.రెస్టారెంట్లలోని బార్‌లు ప్రస్తుతం తెల్లవారుజామున ఒంటి గంట వరకు తీర్చుకోవడానికి అనుమతి వున్న విషయం తెలిసినదే.అయితే దాన్ని 3 గంటల వరకు పొడిగిస్తే ఎక్సైజ్ శాఖ పోలీసులతో సహా ఇతర ఏజెన్సీలతో కలిసి పని చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.నవంబర్ 2021 నుంచి అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీ.
బార్ల నిర్వహణ సమయాలను పొరుగు నగరాలతో సమానంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది.ప్రస్తుతం హర్యానాలోని NCR నగరాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు నడిపేందుకు అనుమతి ఉంది.
అయితే ఈ రెస్టారెంట్‌ల సమయాన్ని పొడిగించే క్రమంలో ఎలాంటి గొడవలు, వేధింపులు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించాలని అక్కడి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఎక్సైజ్ శాఖను కోరారు.NRAI (నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రెసిడెంట్ అయినటివంటి కబీర్ సూరి మాట్లాడుతూ.
కరోనా తరువాత హాస్పిటాలిటీ రంగం భారీగా లైసెన్స్ ఫీజు చెల్లించిందని, అయితే ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం సమయాలను మార్చకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు.సాఫీగా వ్యాపారం జరగడం కోసం పరిస్థితులను మెరుగుపరచాలని ఈ సందర్భంగా అన్నారు.







