హీరో విశ్వక్ సేన్ తాను నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో చాలా వివాదాలను తీసుకువచ్చింది.ఈ వీడియోపై డిబేట్ నిర్వహించిన జర్నలిస్ట్ దేవి నాగవల్లి, హీరో మధ్య పరస్పరం మాటలు పెరిగాయి.
దీంతో ఈ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలోనే ఎంతోమంది రెండు భాగాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది హీరోకు మద్దతుగా నిలబడగా తాజాగా నిర్మాత నట్టికుమార్ దేవి నాగవల్లికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరో విశ్వక్ సేన్ ఆ స్టూడియోని టార్గెట్ చేసే వెళ్లారు.
తన సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేశారు అంటూ ఆరోపించారు.ఈ విధంగా మీడియా ద్వారా తన సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు.తన సినిమా హిట్ అయింది కానీ ఇక్కడ యాంకర్ దేవి నాగవల్లికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.ఒక అమ్మాయి హీరోని గెటవుట్ అనింది అంటే అతని మాటలు ఆమెని ఎంతగా బాధపెట్టి ఉంటాయో అర్థం చేసుకోగలను.
![Telugu Devi Nagavalli, Publicity, Natti Kumar, Prank, Tollywood, Vishwak Sen-Mov Telugu Devi Nagavalli, Publicity, Natti Kumar, Prank, Tollywood, Vishwak Sen-Mov](https://telugustop.com/wp-content/uploads/2022/05/correct-by-natti-kumar-devi-nagavalli.jpg )
ఈ విషయంపై చాలా మంది స్పందిస్తూ విశ్వక్ సేన్ చిన్న హీరో కనుక యాంకర్ అలా మాట్లాడింది.అదే స్టార్ హీరోలను గెటవుట్ అనమనండి అంటూ మాట్లాడుతున్నారు.ఆమెకు బాధ కలిగిస్తే ఏ హీరో నైనా గెటవుట్ అంటారు.ఈ విధంగా విశ్వక్సేన్ ఒక సీనియర్ జర్నలిస్టును ఇలా అవమానకరంగా మాట్లాడటమే కాకుండా తననీ బాధని బాధ పెట్టడంతో జర్నలిస్టులు అందరూ తనని బాయ్ కాట్ చేయాలంటూ, దేవి నాగవల్లికే నా మద్దతు తెలియచేస్తున్నాను అంటూ నట్టికుమార్ షాకింగ్ కామెంట్ చేశారు.