మొదలైన రాజ్యసభ ఎన్నికల వేడి

రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది.జూన్‌లో మరో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

 Rajya Sabha Election Heat Begin In Telengana Lakshmi Kantarao, Srinivas, Banda P-TeluguStop.com

కాస్త అటు ఇటుగా ఈ మూడు స్థానాలకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి ఈ నేప్యథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో అప్పుడే రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది.ఖాళీ అవుతున్న స్థానం నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తారన్నది… ప్రస్తుతం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అయితే ఈ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సీఎం కేసిఆర్ కూడా త్వరలోనే పార్టీలోని పలువురు ముఖ్య నేతలతో మంతనాలు జరపనున్నారని తెలుస్తోంది.ఆ సమావేశంలోనే పార్టీ అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే గత 2018లో రాజ్యసభకు టీఆర్ఎస్ తరుపున బండా ప్రకాశ్ ఎన్నికయ్యారు.పోయిన సంవత్సరం డిసెంబర్ నాలుగున ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు.ఈ తరుణంలో ఎలక్షన్ కమీషన్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఖరారు చేసింది.అయితే ఈ రాజ్యసభ స్థానంతో పాటు అదే పార్టీకి చెందిన లక్ష్మీకాంతరావు , శ్రీనివాస్ ముందొచ్చే నెలలో వారి 6 ఏళ్ల పదవీ సమయం పూర్తి చేసుకుంటారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ ఖరారు చేయనున్నట్లు నేతలు అనుకుంటున్నారు.అయితే రాజ్యసభకు రాజీనామా చేసిన బండా ప్రకాశ్ స్థానానికి మాత్రమే ఎన్నికలు చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారు వెల్లడించారు.

మరో రెండు స్థానాలు కూడా ఖాళీ అవుతున్నా మ్యాటర్ లో కేంద్ర ఎలక్షన్ అంధికారులు ఇంకా ఎటువంటి క్లారీటి ఇవ్వలేదు.

Telugu Banda Prakash, Manda Jagannath, Srinivas, Trs-Political

రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని వారు కొరుతున్నారు .అయితే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావును వరుసగా మూడో పర్యాయం కూడా రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా కొరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube