భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చెందిన స్టడీ సర్కిల్ నీ రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్ ప్రారంభించారు.నేటి యువత అధ్యయనం పట్ల ఆసక్తి ని పెంచుకోవాలని, సెల్ ఫోన్ కే పరిమితం కాకుండా పుస్తకాలు చదవాలని ఆయన పిలుపునిచ్చారు.
నేటి యువత సెల్ఫోన్ సోషల్ మీడియా మోజులో ఉన్నారని, దాని వల్ల సమాజం పట్ల అవగాహన పెంచుకునే దానికంటే, ఇతర విషయాలకు ఎక్కువ సమయం వెచ్చించి నష్టపోతున్నారని అందుకే పుస్తకాల పట్ల దృష్టి పెరగాలని, అధ్యయనం పెరగాలని అప్పుడే కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు.యూత్ ని సక్రమైన మార్గంలో పెట్టేందుకు డివైఎఫ్ఐ మంచి కృషి చేస్తుందని ఆయన అభినందించారు.
ఇలాంటి స్టడీ సర్కిల్ మండల గ్రామ స్థాయిలో కూడా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షైక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్ నీ ప్రతి నెలా నిర్వహిస్తామని, జిల్లా స్థాయి కార్యకర్తలు అందరూ కూడా సైద్ధాంతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ స్టడీ సర్కిల్ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ స్టడీ సర్కిల్ లో షేక్.బషీరుద్దీన్ తోపాటుగా జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, జిల్లా నాయకులు షేక్ రోషన్ ఖాన్, చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, శీలం వీరబాబు, గుమ్మ ముత్తా రావు, కూరపాటి శ్రీను, జక్కంపూడి కృష్ణ, మధులత, పొన్నం మురళి సన్నీ, చిత్తరు మురళి, బొడ్డు మధు, కనపర్తి గిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.