మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎన్నో బరువు బాధ్యతలను తీసుకొని వాటిని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిందే.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తూనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నిత్యం ఆరోగ్య విషయాల గురించి తెలియజేస్తూ ఉంటారు.
ఇక రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.
ఆచార్య సినిమా విడుదలైన వెంటనే రామ్ చరణ్ తన 15 వ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు.
ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇలా రామ్ చరణ్ తన తదుపరి సినిమాలో బిజీగా ఉండటంతో తన సోషల్ మీడియా వేదికగా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది.మండుతున్న ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడం కోసం తనకు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉంది అంటూ ఉపాసన తన కోరికను తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పై రామ్ చరణ్ స్పందిస్తూ నాకు కూడా వెకేషన్ వెళ్లాలని ఉంది కాకపోతే ఏం చేయను కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు.

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరస్పరం ఒకరిపై మరొకరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవడంతో ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ఉపాసన రామ్ చరణ్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఆఫ్రికా అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు ఈ జంట.అక్కడ క్రూరమైన మృగాల మధ్య సవారీ చేస్తూ ఎంజాయ్ చేశారు.







