ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు విశాఖలో వైసీపీ మాయాజాలం ఎన్ సి సి భూముల పై సీబీఐ విచారణకు టిడిపి డిమాండ్

విశాఖపట్నం లో అతి విలువైన ప్రభుత్వ భూములను రెవిన్యూ చట్టాలకు వ్యతిరేకంగా 22-A సెక్షన్ నుండి తొలగించడానికి APHB ని ఉపయోగించి తద్వారా వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలకు GPA మరియు డెవలప్మెంట్ ముసుగు వేసి తరువాత వాటిని అతి తక్కువ ధరలకు అమ్మి వాటిని కంపెనీ షేర్ విలువలు పెంచుటకు ఉపయోగించుకొని వాటి ద్వారా లాభాలు పొంది సదరు భూములు పై ధనవంతులకు విల్లాలు కట్టి అమ్ముకుంటున్నారు.సదరు కోవలోకి ఇప్పుడు సర్వే నెంబర్ 411, 412, 491/1 ad 491/3 మధురవాడ గ్రామం, విశాఖపట్నం యందు ఏకంగా 97 ఎకరాల 30 సెంట్లు APHB ద్వారా NCC కంపెనీ aws, NCCVUIL అనేటువంటి కంపెనీ కి డెవలప్మెంట్ ముసుగులో చట్టాలను తప్పుదోవ పట్టించి 2021 లో కేవలం రూ.180,97,36,000/- కు అమ్మివేశారు.సదరు కంపెనీ GRPL అనే వేరే కంపెనీ కి అమ్మకానికి పెట్టి NCC కంపెనీ యొక్క షేర్ వేల్యూ ని పెంచుకొని లాభం చేసుకోవడమే కాకుండా సదరు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించుకొనుచున్నారని టిడిపి నాయకులు ఆరోపంచారు.

 Tdp Demands Cbi Probe Into Ycp Magic Ncc Lands In Visakhapatnam To Private Compa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube