తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.రైతుల లక్ష రూపాయలు రుణమాఫీ కలగానే మిగిలిపోయిందని వాపోతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ నీటిమీది రాతలుగానే మిగిలిపోయాయని అంటున్నారు.రైతన్నలకు పంట రుణాలు అందక పెట్టుబడి దొరకక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు అన్నదాతలు.
పంటకు గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే అమ్ముకుని ఆవేదన చెందుతున్న అన్నదాతలపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో విషలం అయినట్లు రైతులు చెబుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలు ఆందోళనలో పడ్డారు.
నల్లగొండ జిల్లాలో వరి ప్రధాన పంటగా సేద్యం చేస్తుంటారు.నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో రైతులంతా సాగర్ ఎడుమ కాలువ ఆయకట్టు లక్షల ఎకరాలు సాగులో ఉండగా ఇక్కడ రైతులంతా వరి పంట వేస్తారు.
వరి తప్ప వేరే పంటకు అనుకూలంగా ఉండదు.అయితే వరికి గిట్టుబాటు లేక రైతులు విలవిలలాడుతున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధికంగా రైసు మిల్లులు ఉన్న ప్రాంతం ఇది.ఆసియా ఖండంలోనే రైస్ ఎగుమతిలో ప్రసిద్ది చెందిన నియోజకవర్గం ఇది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఎక్కడ వేసిన గొంగళి చందాన ఉంది.ఖరీఫ్, రభీ సీజన్ లో రైతులంతా వరి నాట్లకు తయారువుతున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అనుకున్నారు.
రైతులు తమ రుణంలో ఒకే సారి లక్ష రూపాయలు మాఫీ అవుతుందని ఆశ పడ్డారు.కానీ ఆశించిన హామీలు నెరవేరలేదు.

తెలంగాణ ప్రభుత్వం 2018 లో నాలుగు విడతలుగా రుణ మాఫీ పక్రియ జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.ఆ విడతల వారీగా జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియతో రైతులకు లాభం లేకుండా పోయింది.మరోవైపు రైతులు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోతున్నారు.మరోవైపు అసలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు షరతు పెట్టడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీతో రైతులకు ఎలాంటి లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల రైతులకు ఉపయోగం లేక చాలవరకు నష్టపోయామంటున్నారు.వరి ధ్యాన్యం కొనుగోలు చేయలేమని చెప్పిన పంటనే సేద్యం చేయాలంటూ చేసిన ప్రకటన వల్ల వేరే పంటను పండించలేక కొంత మంది వరి దాన్యం వేస్తే ప్రైవేటు మిల్లర్లకు అమ్మితే తక్కువ ధరకే దాదాపుగా సగానికిసగం రైతులు అమ్ముకున్నారు.తాజాగా వరి కొనలేమని చెప్పిన ప్రభుత్వం ఐకేపి సెంటర్లను ఏర్పాటు చేసి దాన్యం కొనుగోలు చేయడం అన్యాయమని రైతులు వాపోయారు.
తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు ప్రభుత్వం తరపున 500 రూపాయలు క్వింటాలుకు చెల్లిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు.ధరణీ పోర్టల్ లో ఉన్న సమస్యలన్ని తొందరగా పరిష్కరించి రైతులను ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాలు కోరుకుంటున్నారు.







