2019 లోనే చంద్రబాబుని బాదేశారు అంటున్న వైసీపీ మంత్రి..!!

ఏపీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు అనే నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.వైసీపీ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ధరలు మరియు విద్యుత్ ధరలు ఇంకా నిత్యావసర సరుకుల ధరలు ఈ విషయంలో నిరసన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి.

 Ycp Minister Serious Comments On Chandrababu , Ycp, Chandrababu, Ycp Minister Gu-TeluguStop.com

ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం చంద్రబాబు “బాదుడే బాదుడు” కార్యక్రమంలో పాల్గొనటానికి శ్రీకాకుళం చేరుకోనున్నారు.ఇటువంటి తరుణంలో చంద్రబాబుపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు జరిగిన మూడు సంవత్సరాలకు చంద్రబాబుకి రాష్ట్రం గుర్తొచ్చింది అని సెటైర్లు వేశారు.“బాదుడే బాదుడు” అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబును బాదాలా అని ప్రశ్నించారు.ఆల్రెడీ చంద్రబాబుని 2019 ఎన్నికల లోనే ప్రజలు బాదేశారని పేర్కొన్నారు.కేవలం పొలిటికల్ మైలేజీ కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేపడుతున్నారు అని విమర్శించారు.ఇక సింహాద్రి అప్పన్న ఆలయానికి సంబంధించి విచారణ జరిపిస్తామని నిజానిజాలు వెలికి తీస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube