కెనడాలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా బిజిబిజీ .. ఓపెన్ స్కైస్ పాలసీపై చర్చలు

కెనడా రవాణా మంత్రి ఒమర్ అల్గాబ్రాతో భారత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కెనడాకు చేరుకున్న సంగతి తెలిసిందే.

 Union Civil Aviation Minister Jyotiraditya Scindia Meets Canadian Counterpart,-TeluguStop.com

గడిచిన రెండేళ్లలో ఓ భారత కేబినెట్ మంత్రి కెనడాలో ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి.చివరిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డిసెంబర్ 2019లో కెనడాలో పర్యటించారు.

ఈ సందర్భంగా అప్పటి ఆ దేశ విదేశాంగ మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపైన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా సింధియా మీడియాతో మాట్లాడుతూ.

ఇరు దేశాల మధ్య ఎయిర్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడానికి సరైన విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు.ఓపెన్ స్కైస్ ఫ్రేమ్‌వర్క్‌ విధానంలో దేశాల మధ్య అపరిమితంగా డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ఫ్లైట్స్ వుంటాయని జ్యోతిరాదిత్య తెలిపారు.

అల్గాబ్రాతో చర్చలు ఫలవంతంగా ముగిశాయని ఆయన చెప్పారు.తదుపరి దశల చర్చలలో పౌర విమానయాన సహకారంపై ఒక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంటామని సింధియా తెలిపారు.నిర్వహణ, మరమ్మత్తులు, హెలికాఫ్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు, విమానాల తయారీ వంటి అంశాలు ఇందులో వుంటాయని జ్యోతిరాదిత్య చెప్పారు.

2016లో కుదుర్చుకున్న ఎంవోయూ గడువు 2019లో ముగిసిందని.దీనిని తిరిగి పునరుద్ధరించాల్సి వుందని కేంద్ర మంత్రి తెలిపారు.రాబోయే రెండు వారాల్లోనే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని సింధియా స్పష్టం చేశారు.విమానయాన రంగంలో భారత్- కెనడాల మధ్య సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై ఈ ఒప్పందం దృష్టి సారిస్తుందన్నారు.అలాగే ఇరు దేశాల మధ్య ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అగ్రిమెంట్ (ఏటీఏ) కూడా ఎజెండాలో వుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ప్రస్తుతం కెనడా నుంచి భారత్‌కు 20 విమానాలు.భారత్ నుంచి కెనడాకు 10 విమానాలు నడుస్తున్నట్లు సింధియా చెప్పారు.

భారత్ నుంచి కెనడాకు డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ను పెంచడానికి ఓపెన్ స్కైస్ పాలసీపై పనిచేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయని.ఒట్టావాలోని భారత హైకమీషనర్ అజయ్ బిసారియా ట్వీట్ చేశారు.

Telugu Air Transport, Foreignfrancois-Telugu NRI

ఇకపోతే.కెనడా పర్యటనలో భాగంగా క్యూబెక్ ప్రావిన్స్‌ మాంట్రియల్‌లోని కెనడియన్ కంపెనీ బొంబార్డియర్ , మిరాబెల్‌లోని ఎయిర్‌బస్ ఫెసిలిటీలను కూడా జ్యొతిరాదిత్య సింధియా సందర్శించారు.బుధవారంతో సింధియా కెనడా పర్యటన ముగియనుంది.మాంట్రియల్‌లోని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో)లో కొన్ని అధికారిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube