ఒక్కోసారి మనం ఎవరం ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి.అసలు ఆ సంఘటన నిజామా.
లేక కల్పితమా అని తెలుసుకునే లోపే మనం షాక్ లోకి వెళ్లి పోతూ ఉంటాము.సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక మహిళ విషయంలో జరిగింది.
చనిపోయిందని భావించిన ఒక మహిళను శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టే సమయానికి ఒక వింత ఘటన చోటు చేసుకుంది.శవపేటికలో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు బయటకు వినిపించసాగాయి.
ఆ శబ్దాలు విని అక్కడ ఉన్నవారు అందరు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.తీరా ఆ శవపేటిక ఓపెన్ చేసి చూడగా చనిపోయిందని భావించిన ఆ మహిళ కాస్త కూర్చుని ఉండడం చూసి అందరు అవాక్ అయ్యారు.
ఆమె మనిషా లేక దెయ్యమా అనే సంధిగ్ధంలో ఉండిపోయారు.
ఈ సంఘటనకు సంబందించి వివరాల్లోకి వెళ్తే పెరులోని లంబాయెక్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
లంబాయెక్ ప్రాంతానికి చెందిన రోసా అనే ఒక మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె కారు ఘోర ప్రమాదానికి గురైంది.ఈ ఆక్సిడెంట్ లో రోసా బావ చనిపోగా, ఆమె ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
అలాగే రోసాకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా రోసా ట్రీట్మెంట్ పొందుతూనే చనిపోయింది.దీంతో వారి కుటుంబ సభ్యులు చనిపోయిన రోసా బావకి, రోసాకి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే రోసా బాడీని ఒక శవ పేటికలో పెట్టి మూసివేశారు.
ఆ శవ పేటికను గోతిలో కప్పెట్టేందుకు కుటుంబీకులు భుజాలపై పెట్టుకోగా పెట్టేలోపల నుండి నేను బతికే ఉన్నాను అంటూ రోసా గట్టిగా అరుస్తూ, శవ పెటికను కొడుతూ పెద్దగా శబ్దాలు చేయసాగింది.
దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యి శవపేటికను కిందకు దించి తెరిచి చూశారు.వెంటనే రోసా అందులో నుంచి లేచి కూర్చొని నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పింది.
రోసాను బతకి ఉందని తెలిసి ఆనందించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శవపేటిక నుంచి బయటకు తీయకుండానే అంబులెన్స్ ఎక్కించారు.కాగా వైద్యులు ఆమెకు కృత్రిమ శ్వాసను అయితే అందించారు కానీ అప్పటికే రోసా పరిస్థితి విషమంగా మారడంతో బతికిన కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయింది.
రోసా బతికిందని ఆనందపడేలోపే ఆమె మళ్లీ చనిపోయిందన్న వార్త ఆమె కుటుంబ సభ్యులు తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయ్యారు.







