మాస్ లీడ‌ర్ల కోసం వెతుకుతున్న బాబు.. ఉన్నోళ్లంతా ఏమ‌య్యారు...?

జనాల్లో మాస్ లీడ‌ర్ అంటే ఆ క్రేజ్ ఏ వేరు.ఆ నేత ఎక్క‌డికి వెళ్లినా నిరాజ‌నాలు ప‌లుకుతారు.

 Chandra Babu Looking For Mass Leaders To Work For Tdp Party Details, Tdp,chandr-TeluguStop.com

స్టేట్ మొత్తంలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది.ఏ పిలుపిచ్చినా స‌క్సెస్ అవుతుంది.అంత‌టి వారు ప్ర‌స్తుతం ఏపీలో.టీడీపీలో ఉన్నారంటారా.? అయితే మాస్ లీడ‌ర్.అన‌గానే మ‌న‌కు గుర్తుకువ‌చ్చేది ఎన్టీరామారావు.

పార్టీ పెట్టిన కేవ‌లం తొమ్మిది నెల‌ల్లోనే అధికారంలోకి వ‌చ్చి సీఎం కూర్చీలో కూర్చున్నారంటే ఆయ‌న‌కున్న మాస్ ఫాలోయింగ్ అర్థం చేసుకోవ‌చ్చు.ఎన్టీఆర్ త‌ర్వాత మ‌ళ్లీ ఆరేంజ్ నాయ‌కుడు రాలేదంటే న‌మ్మ‌శ‌క్యం కాదు.

వాస్త‌వానికి మాస్ లీడ‌ర్ అనిపించుకోవ‌డం అంత ఈజీ ఏం కాదు.అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ మాములుది కాదు.

మాస్ లీడ‌ర్లంటే ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో క్రేజ్ త‌గ్గ‌దు.మాస్ లీడ‌ర్లు అంటే ప్ర‌తిప‌క్షాల‌ను బండ బూతులు తిట్టి ఉన్న క్రేజ్ కూడా పోగొట్టుకునే వాళ్లు అయితే కాద‌ని చెప్పాలి.

ఇప్ప‌టికే బూతుల నేత‌ల ప‌రిస్థితి ఏమైందో అందిరికి తెలిసిందే.

అయితే టీడీపీ కేడ‌ర్ గ్రామాల్లో కూడా బలంగా ఉంది.

దీనికి మంచి ప‌ట్టున్న మాస్ లీడ‌ర్ తోడైతే అధికారంలోకి రావ‌డం ఖ‌య‌మ‌ని చెప్పాలి.ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను వేళ్ల‌పై లెక్కించ‌వ‌చ్చు.

ఒక‌ప్పుడు టీడీపీ పెట్టిన రాజ‌కీయ బిక్ష‌తోనే ఎదిగి ఆ పార్టీకే హ్యాండ్ ఇచ్చి ప‌క్క‌పార్టీల్లో చేరారు.ఒక‌రు అవ‌స‌రం కోస‌మైతే.

మ‌రొక‌రు త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో వెళ్లాల్సి వ‌చ్చింది.టీడీపీలో ఉన్న సీనియ‌ర్లు అంతా త‌లో దారి చూసుకోవ‌డం, ఉన్న వాళ్లు రిటైర్డ్ ద‌గ్గ‌ర‌లో ఉండ‌టం టీడీపీకి మైన‌స్ అనే చెప్పాలి.

ఇక ఉన్న వాళ్లు బిజినెస్ లు చూసుకోవ‌డంతోనే స‌రిపోయింది.

Telugu Ap, Chandrababu, Mla Balakrishna, Lokesh, Tdp Mass, Tdp Senior, Telugu De

టీడీపీ తిరిగి పుంజుకోవాలంటే మాస్ లీడ‌ర్ల అవ‌స‌రం ఎంతైనా ఉంది.చంద్ర‌బాబు త‌ర్వాత ఆ స్ఠాయి నాయ‌కుడు టీడీపీలో లేక‌పోవ‌డంతో ఓకింత క‌ష్ట‌మే అని చెప్పాలి.ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బాల‌య్య బాబు, లోకేష్ బాబుల క్రేజ్ ఏ మాత్రం స‌రిపోదు.

అధికార ప‌క్షానికి దీటుగా వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లాలి.అయితే టీడీపీలో ఇప్పుడు ఆ ప‌ని ఎవ‌రు చేయ‌గ‌ల‌రు.

అంద‌రినీ స‌మ‌న్వ‌య పిరిచి గెలుపు దిశ‌గా వెళ్లే నాయ‌కులు కావాలి.

Telugu Ap, Chandrababu, Mla Balakrishna, Lokesh, Tdp Mass, Tdp Senior, Telugu De

జ‌నాల ప‌ల్స్ తెలిసిన నాయ‌కుడై ఉండాలి.ఇప్పుడు ఆ ఊపు టీడీపీకి ఎంతో అవ‌స‌రం.చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఎంత తొంద‌ర‌గా మెల్కుంటే అంత మంచిది.

సీనియ‌ర్ల‌లాగా అంత ప‌రిజ్ఞానం ఉన్న‌వాళ్లు అయితే ప్ర‌స్తుతం క‌నిపించ‌డంలేదు.క‌నీసం కొత్త‌త‌రంపైనా అయినా ఫోక‌స్ పెట్టి మాస్ లీడ‌ర్లుగా ఎదిగేలా ప్రోత్స‌హిస్తే బాగుంటుంది.

అప‌ర చాణ‌క్యుడు చంద్ర‌బాబుకు మాస్ లీడ‌ర్లు తోడైతే ఇక తిరుగుండ‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube