హద్దులు దాటుతున్న అభిమానం... చివరికి నష్టం ఎవరికో తెలుసా?

ఒక సినిమా హిట్ లేదా ప్లాప్ అన్నది ఎవరి చేతుల్లో ఉండని విషయం అని చెప్పాలి.ఎందుకంటే ఒక సినిమా కార్యరూపం దాల్చాలంటే దాని వెనుక వందల మంది కృషి ఉంటుంది.

 Fans Made Movies Flop In Tollywood ,fans , Tollywood , Prabhas , Radhyshyam, Ra-TeluguStop.com

నిర్మాతలు వందల కోట్ల డబ్బు దర్శకుడిని తాను చెప్పిన కథను నమ్మి వెనకడుగు వేయకుండా ఖర్చు చేస్తారు.ఏ దర్శకుడు కూడా సినిమా ప్లాప్ అవ్వాలని సినిమా తీయరు.అయితే ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల మైండ్ సెట్ కు తగ్గ కథలను ఎంచుకోవడంలో ? ఆ కథకు సరైన నటీనటులను ఎంచుకోవడంలో? లోపాలు ఉంటాయి కానీ సినిమాను తీసే విషయంలో లోపాలు ఉండవు.100 కి 100 శాతం సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే డైరెక్టర్ ముందుకు వెళతాడు.కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఫెయిల్ అవుతుంది.ఇక్కడ నష్టపోయేది నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పాలి.కానీ ఎటువంటి సంబంధం లేని సినిమా చూసే ఫ్యాన్స్ మాత్రం నానా హంగామా చేస్తున్నారు.టాలీవుడ్ లో ప్రధానంగా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, మంచు ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఒక హీరో సినిమా వస్తే… దానికి యాంటీగా ఉన్న మరో హీరో ఫ్యాన్స్ కావాలనే ఈ సినిమా బాగున్నా నెగటివ్స్ ను వెతుకుతూ సోషల్ మీడియాలో గందరగోళం చేస్తున్నారు.ఇలా ఫ్యాన్స్ మధ్యలో హీరోల కోసం కొట్టుకు చస్తారు.

కానీ స్టార్ హీరోలు అంతా కూడా కలిసిమెలసి పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు.ఇంత చిన్న లాజిక్ ను ఫ్యాన్స్ అంతా ఎందుకు మిస్ అవుతున్నారో అర్ధం కావడం లేదు.

రాధే శ్యామ్ మూవీ విడుదలకు ముందు లేటెస్ట్ అప్డేట్స్ రావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాత మరియు దర్శకుల మీద చేసిన రచ్చ ఇంకా గుర్తుండే ఉంటుంది.దాదాపుగా ఈ విషయంపై చాలా వివాదం చోటు చేసుకుంది, చివరికి ప్రభాస్ కల్పించుకుని నిర్మాతలతో మాట్లాడడంతో సర్దుమణిగింది.

అలా ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలను రాధే శ్యామ్ పై పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుని ఫ్యాన్స్ ను దారుణంగా మోసం చేసింది.

ఇక ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా దర్శకుడిని టార్గెట్ చేశారు.సినిమా తీయడం రానప్పుడు ఇంత పెద్ద సినిమాకు ఎందుకు కమిట్ అయ్యావు? అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో ఆడుకున్నారు.అయితే ఇక్కడ డైరెక్టర్ ను విమర్శించిన వాళ్ళు కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మరియు డైరెక్టర్ లపై విరుచుకుపడ్డారు.

కానీ ఎందుకు ఇలా యాంటీ ఫ్యాన్స్ తయారవుతున్నారో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అర్ధం కావడం లేదు.

Telugu Allu Arjun, Fans, Jr Ntr, Manchu Fans, Prabhas, Radhakrishna, Radhyshyam,

ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో స్టార్ట్ అయిన విమర్శలు సినిమాలో రామ్ చరణ్ రోల్ కన్నా ఎన్టీఆర్ రోల్ ను ఎందుకు తగ్గించారు అన్న మాట వరకు చాలా వివాదాలే జరిగాయి.ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు.ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా నానా యాగీ చేశారు.

ఇక ఆ తర్వాత ఇరు హీరోల ఫ్యాన్స్ కలిసి డైరెక్టర్ రాజమౌళిని టార్గెట్ చేయడం కొసమెరుపు.ఇక చాలా కాలం నుండి బన్నీ మహేష్ ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతూ ఉన్న విషయం తెలిసిందే.

గత సంవత్సరం బన్నీ అలా వైకుంఠపురంలో మూవీ తో సరిలేరు నీ కెవ్వరు సినిమా రిలీజ్ అయింది.ఈ సమయంలో ఇరు హీరోల ఫ్యాన్స్ మా సినిమా హిట్ అంటూ వాదనలకు దిగారు.

ఆ తర్వాత మా హీరో సినిమాకే ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయని అదొక గొడవ ఇలా ప్రతి దానికి రచ్చ జరగాల్సిందే.

Telugu Allu Arjun, Fans, Jr Ntr, Manchu Fans, Prabhas, Radhakrishna, Radhyshyam,

ఆచార్యకు ముందు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా ప్లాప్ కావడంతో మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.ఇక ఆ విషయాన్ని గుర్తించుకున్న మంచు ఫ్యాన్స్ ఇప్పుడు మెగాస్టార్ మూవీ ఆచార్య ప్లాప్ కావడంతో తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నారు.ఆచార్య మూవీ ఎన్నో అంచనాలతో గత వారమే థియేటర్ లో విడుదల అయింది.

కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా నిరాశ పరిచింది.అయితే మెగా యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాలో ఉన్న నెగటివ్ పాయింట్స్ ను తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా చేసిన వారిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మంచు ఫ్యాన్స్ లు ఈ ఆనందమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు.అయితే సినీ పెద్దలు చెబుతున్న ప్రకారం ఒక హీరో హిట్ ను మరొక హీరో ఫ్యాన్స్ ద్వేషించడం అన్నది కరెక్ట్ కాదు అంటూ ఫ్యాన్స్ కు చురకలు అంటిస్తున్నారు.

మరి ఈ ట్రెండ్ ఎప్పటికి మారుతుందో అన్నది తెలియాల్సి ఉంది.తమను ఎంతగానో అభిమానించి, ప్రేమించి సందడి చేసే ఫ్యాన్స్ ఇలా మరో స్టార్ హీరోలకు శత్రువులుగా ఎందుకు మారుతున్నారా అర్ధం కావడం లేదు.

చివరికి ఇది ఎవరికీ శాపంగా మారనుంది అనేది చూస్తే.తెలుగు సినిమా పరిశ్రమ పఠనం కావడానికి నాంది అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube