వివాదాల క్రైస్తవ మత భోదకుడు కేఏ పాల్ పై ఇటీవల టీఆర్‌ఎస్ కార్యకర్త దాడి చేసిన విషయం తెల్సిందే.ఆ సమయంలో కేఏ పాల్ వెంట ఉన్న వారు ఆయన్న వారించారు.
పాల్ కూడా షాక్ కు గురయ్యి కొన్ని సెకన్లు అలా చూస్తూ ఉండి పోయాడు.పాల్ పదే పదే టీఆర్‌ఎస్ ను విమర్శిస్తూ ఉండటం వల్లే తాను ఆ పని చేసినట్లుగా సదరు వ్యక్తం మాట్లాడాడు.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కేఏ పాల్ పై దాడి విషయమై రామ్ గోపాల్ వర్మ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.మొదట అంత గట్టిగా దెబ్బ తలిగినా కూడా పాల్ కు కనీసం ఏం కాలేదు అంటే అది ఫేక్ చెంప దెబ్బ అయ్యి ఉంటుందేమో అనిపిస్తుందంటూ కామెంట్స్ చేశాడు.
ఒక వేళ అది ఫేక్ చెంప దెబ్బ కాకుండా ఉంటే మాత్రం పాల్ చర్మం అంత మందంగా ఉందేమో అంటూ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రామ్ గోపాల్ వర్మ గతంలో పాల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మాత్రమే కాకుండా పాల్ కు వ్యతిరేకంగా సినిమాను కూడా తెరకెక్కించాడు.
పాల్ మరియు వర్మ మద్య వివాదం కొన్నాళ్ల పాటు పీక్స్ లో నడిచి జనాలకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ను అందించింది.ఇప్పుడు మళ్లీ పాల్ చెంపదెబ్బ విషయమై వర్మ స్పందించడం తో ఈ విషయం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పాల్ గతంలో మాట్లాడుతూ వర్మ తన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని.నా కాళ్లు మొక్కాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు.ఆ వ్యాఖ్యలు వర్మ ఈగో ని హర్ట్ అయ్యేలా చేసి పాల్ పై రెచ్చి పోయాడు.అందులో భాగంగానే చెంప దెబ్బ ఎపిసోడ్ పై తనదైన శైలిలో స్పందించాడు.







