దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్ ను ఇప్పటివరకు రాజకీయ వ్యూహకర్తగా నే అందరూ చూశారు.రానున్న రోజుల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం రాజకీయంగా సంచలనం రేపింది.
దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఆయన వ్యూహాలు సమర్థవంతంగా పని చేశాయి.ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి అంటే దానికి కారణం ప్రశాంత్ కిషోర్ సమర్ధతే కారణం.
అందుకే ఆయనకి ఎప్పటికీ అంత డిమాండ్ ఉంది.దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల కూటమి తెర పైకి వచ్చిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా మూడో ప్రత్యామ్నాయ వేదిక కోసం పనిచేశారు.
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉండేలా చేస్తారని అంతా భావించారు .కానీ ఆయన కాంగ్రెస్ తోనూ చర్చలు జరపడం ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించడం వంటివి అన్ని అందర్నీ ఆశ్చర్య పరిచాయి.కానీ ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరడం లేదని ప్రకటించారు.కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గా సోషల్ మీడియాలో హింట్ అయితే ఇచ్చారు.” ప్రజల పక్షాన విధివిధానాలను రూపొందించేందుకు అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసేందుకు పదేళ్లుగా ప్రయాణం చేశానని, ఈ ప్రయాణంలో కొత్త పేజీ తిప్పుతున్నట్టు చెప్పారు.ఆ మార్గమే జన్ సురజ్ ( ప్రజా సుపరిపాలన ) అని తన ప్రయాణాన్ని బీహార్ నుంచి ప్రారంభిస్తాను అంటూ ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
ఇప్పుడు ఈ వ్యవహారంపై అటు బీజేపీ, కాంగ్రెస్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఆసక్తిగా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం వెనుక కారణాలు ఏమిటనేది అందరికీ అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు.దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలకు పనిచేసిన అనుభవంతో ఆయన ఇప్పుడు కొత్త పార్టీని స్థాపించాలని , ఎంతోమంది రాజకీయ నేతలను తయారుచేసిన తాను సక్సెస్ ఫుల్ రాజకీయ నేతగా దేశంలో కీలకం అవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నట్లు గా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీకే రాజకీయ అడుగుల పై ప్రధాన పార్టీలన్నీ టెన్షన్ పడుతున్నాయి.







