సమ్మర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.మే నెల వచ్చిందో లేదో ఎండలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ప్రతి రోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు.
రోజూవారీ పనుల కోసం కూడా బయటకు రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇక పెద్దలకే ఇలా ఉంటే చంటి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మండే ఎండలు, ఉక్కపోత, అధిక చెమటలు కారణంగా పిల్లలు ఎప్పుడూ మూడీగా, నీరసంగా కనిపిస్తుంటారు.అలాగే ఒంట్లో వేడెక్కువ అవ్వడం, విరోచనాలు, వాంతులు వంటివి కూడా పిల్లల్లో ఏర్పడుతుంటాయి.
అయితే వీటన్నికీ చెక్ పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని పెంచడానికి, వారి బాడీలో ఓవర్ హీట్‌ను తొలగించడానికి ఆయిల్ మసాజ్ అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా కొబ్బరి నూనెను ఉపయోగించి ప్రతి రోజు పిల్లలకు మసాజ్ చేస్తే గనుక బోలెడు లాభాలు లభిస్తాయి.
సాధారణంగా పిల్లల బాడీ మసాజ్ కు కొందరు బాదం నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె ఇలా ఏవేవో వాడుతుంటారు.కానీ, ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో మాత్రం అవేమి కాకుండా కొబ్బరి నూనెనే యూస్ చేయాలి.
కొబ్బరి నూనెతో పిల్లలకు మసాజ్ చేస్తే వారి శరీరంలో ఉన్న అధిక వేడి మొత్తం తొలగి పోతుంది.బాడీ కూల్‌గా మారుతుంది.పిల్లలు ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారతారు.అలాగే వేసవి కాలంలో పిల్లలు ఏమీ తినడానికి, తాగడానికి ఇష్టపడరు.
అయితే కొబ్బరి నూనెతో రోజుకు ఒక సారి పిల్లల శరీరానికి మసాజ్ చేస్తే.వారిలో ఆకలి పెరుగుతుంది.

అంతేకాదు, కొబ్బరి నూనెను ఉపయోగించి పిల్లలకు బాడీ మసాజ్ చేయడం వల్ల.బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా మారుతుంది.ఎముకలు దృఢంగా పెరుగుతాయి.
ఏమైనా నొప్పులు ఉంటే తగ్గుముఖం పడతాయి.చర్మం తేమగా, నిగారింపుగా ఉంటుంది.
మరియు పిల్లలకు చక్కటి నిద్ర సైతం పడుతుంది.







