నేలకొండపల్లి పోలీసుల పై మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో ఫిర్యాదు చేసిన దంపతులు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలిసులు తమ పై దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి, ఉన్నత అధికారులకు ఓ దంపతులు ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేసారు.

 The Couple Complained To Minister Ktr On Twitter About The Nelakondapalli Police-TeluguStop.com

దంపతులు చెబుతున్న వివరాలు ప్రకారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు అతని భార్య భవానీ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

తమ కుటుంబ సభ్యులను చూసేందుకు భార్యభర్తలతో పాటు భవానీ సోదరుడు వెంకటేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామం కమలాపురం వస్తున్నారు.నేలకొండపల్లి చేరుకునే సరికి నిన్న సుమారు రాత్రి 12.20 అయింది.ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని ఆపి సంబంధం లేని ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేశారు.

ఈ సమయంలో తిరగడం ఏంటి.నీది ఏ కులం, బస్సు టికెట్లు చూపించాలంటూ నిలదీశారని, బైక్ పై వస్తున్నామని నా భార్య చెబితే ఇతను నీ భర్త అని గ్యారంటీ ఏంటని హేళనగా మాట్లాడారన్నారు.

పెళ్లి ఫోటోలు, తాళి బొట్టు చూపీంచినా కనికరించకుండా సుమారు అర గంట పాటు వారిని మనో వేదనకు గురిచేశారని వాపోయారు.

అనంతరం అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసుల పై మంత్రి కెటిఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, సిఎంఓ తో పాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు భాదితులు దుర్గారావు, భవానీ ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు.

అలాగే ఖమ్మం సిపి విష్ణు ఎస్ వారియర్ కు ఫిర్యాదు చేసేందుకు సిపి కార్యాలయం ఆ దంపతులు చేరుకున్నారు.అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube