రోడ్డు ప్రమాదాలు ప్రస్తుత జనరేషన్ లో నిత్యకృత్యాలు అయ్యాయి.ప్రతీ రోజు ఏదోచోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.చేయని తప్పుకు అవతలి వాహనదారుల నిర్లక్షానికి కూడా నుండు ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయాయి.2021- 22 సంవత్సరాల కాలంలో కేవలం నిర్లక్షంగా వాహనం నడిపి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఇందులో అవతలి వాళ్ళ నిర్లక్షానికి బలైనవారు కూడా వున్నారు.
ర్యాష్ డ్రైవింగ్, మధ్యం తాగి డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, ఇలాంటి వాటి వల్లే ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయి.
తాజాగా కేరళ లో జరిగిన రోడ్డు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై అధిక స్పీడ్ తో వస్తున్నారు వారికి ఎదురుగా కార్ వస్తుంది.
స్పీడ్ గా వస్తున్న వారి బైక్ కు బ్రేక్ పడకపోవడంతో ఎదురుగా వున్న కార్ మీదికి దూసుకెళ్లారు.దీంతో బైక్ మీదున్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపోయారు.
కార్ లో వున్న వ్యక్తికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ప్రమాదంలో శబ్దం శబ్దాలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తలించారు.
మరో వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ లారీ పక్కన రోడ్డుపై వాహనం నడుపుతున్నాడు రోడ్డు దాటే ప్రయత్నంలో అతనికి ఎదురుగా ఆటో వచ్చింది.వెనక నుండి వస్తున్న రెండు వాహనాలు కనపడకపోవడం వల్లా ఈ రెండు వాహనాలను ఢీ కొని రోడ్డు మీద కిందపడి వ్యక్తి కోమాలోకి వెళ్ళాడు.
ప్రస్తుతం ఈ వీడీయో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతున్నా వాహనదారు ల్లో మాత్రం చలనం కలగడం లేదు.
ఎలాంటి మేల్కొలుపు లేకుండా తరుచు ప్రమాదాల భారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాల అవగాహన గురించి రోడ్లపై బోర్డ్ లు, ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.
మైనర్ యువకులు అతివేగంగా బైక్ లు నడుపుతూ రోడ్డు మీద వెళుతున్న ఇతర వాహన దారుల ప్రాణాల మీదికి తెస్తున్నారు.హెల్మెట్ దరించమని, నిదానంగా వెళ్లాలని ఎన్ని సూచనలు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యడు.







