జంతువులు ఎప్పుడూ కూడా తమ ఆహారం కోసం వెతుకుతూనే ఉంటాయి.వాటికి అవకాశం లభించిన వెంటనే ఇతర జంతువులపై దాడి చేస్తాయి.
ఈ జంతువులు ఎరను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరిస్తూ దాడికి సిద్ధమవడం జరుగుతుంది.ముఖ్యంగా సింహం, చిరుత లాంటి పెద్ద పెద్ద జంతువుల స్టైల్ సోషల్ మీడియా లోనూ వైరల్‌గా మారినవి చాలానే ఉన్నాయి.
అందులో జంతువులు ఒకదానికొకటి వేటాడడాన్ని మనం చూడవచ్చు.ఇక జంతువుల్లో వేట ఇలా ఉంటే.
పక్షుల్లో మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి గ్రద్ద, డేగ.
గాల్లో ఎగిరే జంతువుల్లో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా డేగ, గద్దకు పేరుంది.అవి కన్నేసాయంటే ఎలాంటి జంతువును అయినా తన ఆహారంగా మార్చుకుంటుంది.నాలుగు కాల్లు ఉన్న జంతువులను కూడా ఈ డేగలు చాలా సార్లు వేటాడటం మనం చూస్తున్నాం.
గద్ద తన ఆకలిని తీర్చుకునేందుకు చిన్న చిన్న పక్షులను, చేపలను వేటాడుతుంది.గద్ద ఎక్కడ నుంచి వాటిని గమనించిందో వెంటనే ఆలస్యం చేయకుండా వేటకు రెడీ అయిపోతుంది.
చిరుత వేగంతో ఆ గద్ద ఓ పక్షిని తన కత్తుల్లాంటి కాళ్లతో క్యాచ్ చేస్తుంది.ఇక ఆ తర్వాత ఆ పక్షి కాస్తా ఆ గద్దకు ఆహారంగా మారిపోతుంది.అయితే.తాజాగా గద్ద వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఆ వీడియో చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.అప్పటి వరకు ఆకాశంలో అటూ ఇటూ ప్రశాంతంగా విహరిస్తున్న గద్ద ఒక్కసారిగా కిందకు వచ్చింది.నీటిలో ఈదుతున్న చేపను ఆకాశం నుంచే పసిగట్టిన గద్ద.చేపను క్షణాల్లో వేటాడింది.నీటిలో ఉన్న చేపను తన కాళ్లకు ఉన్న పదునైన కత్తుల్లాంటి గోళ్లతో పట్టేసి గాళ్లో ఎత్తుకెళ్లిపోయింది.క్షణ కాలంలో జరిగిన ఈ గద్ద వేట అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరీ ఇంత భయంకరంగా, వేగంగా వేట సాగిస్తాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇప్పుడు ఈ సీన్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.







